English | Telugu
డాక్టర్ బాబు అరెస్ట్... జైలుకు తీసుకెళ్లిన పోలీసులు!
Updated : Aug 7, 2021
'కార్తీక దీపం'లో కీలక మలుపు చోటు చేసుకుంది. కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జైలుకు తీసుకు వెళ్లారు. అసలు ఏం జరిగింది? అనేది పూర్తిగా తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. అంతలా ప్రోమోలో ట్విస్ట్ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి ఎపిసోడ్ ఎండింగ్‌లో మోనితను చంపేస్తానని కార్తీక్ అన్నాడు. కార్తీక్ కాకుండా ఎవరో మోనితను చంపి, ఆ హత్యానేరం కార్తీక్ మీద తోసినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అసలు, అందులో ఏముంది? అనే అంశంలోకి వెళితే...
కార్తీక్, దీప ఇంట్లో ఉంటారు. వాళ్ళింటికి పోలీసులతో ఏసీపీ రోషిణి వస్తుంది. 'రండి మేడమ్. మేమే మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాం' అని దీప అంటుంది. 'ఎందుకు? లొంగిపోవడానికా?' అని రోషిణి ప్రశ్నిస్తుంది. 'ఏమైంది?' అని దీప అంటుంది. ఆమెతో కాకుండా కార్తీక్‌తో రోషిణి మాట్లాడటం మొదలు పెడుతుంది. 'మోనిత శవాన్ని ఎక్కడ దాచావ్?' అని ప్రశ్నిస్తుంది. 'శవం ఏంటి?' అని దీప అడుగుతుంది. 'నీ భర్త మోనితను షూట్ చేసి చంపి, శవాన్ని మాయం చేశాడు' అని రోషిణి చెబుతుంది. దీప మాత్రమే కాదు, ఆమె మాటలకు కార్తీక్ కూడా షాక్ అవుతాడు.
మోనితను హత్య చేశాడనే అభియోగం మీద కార్తీక్ ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళతారు. దీపతో పాటు కుటుంబ సభ్యులు అందరూ కన్నీరు మున్నీరు అవుతారు. కొత్తగా విడుదల చేసిన ప్రోమోతో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. మోనిత శవం కనిపించడం లేదని ఏసీపీ రోషిణి చెప్పింది. దీనిబట్టి అసలు మోనిత నిజంగా మరణించిందా? లేదంటే నాటకం ఆడుతుందా? అనే సందేహం కలగక మానదు. మోనిత జైలుకు వెళుతుందని ప్రేక్షకులు అందరూ భావిస్తున్న తరుణంలో కార్తీక్ ను జైలుకు పంపి దర్శకుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.