English | Telugu
"చిచ్చా.. అషుతో అలా చెయ్యొద్దు".. బతిమలాడిన హరి!
Updated : Aug 7, 2021
సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్, ఇమ్మాన్యుయేల్ - వర్ష తర్వాత బుల్లితెర వినోద కార్యక్రమాల్లో హరి - అషురెడ్డి జోడీకి పాపులారిటీ దక్కింది. ఇద్దరికీ ఫాన్స్ ఉన్నారు. ఫాలోయింగ్ ఉంది. అషురెడ్డితో 'కామెడీ స్టార్స్'లో హరి చేసే స్కిట్లు పేలుతున్నాయి. గుండెల మీద అషురెడ్డి పేరును హరి టాటూ వేయించుకోవడం, తర్వాత దాని మీద పేరడీగా ఒక స్కిట్ చేయడం వంటివి తెలిసిన విషయాలే.
కొత్త విషయం ఏంటంటే... రీసెంట్‌గా ఆఫ్రికన్ చిచ్చా చార్లెస్‌తో అషురెడ్డి ఒక రీల్ చేసింది. దానికి వ్యూస్ బాగా వచ్చాయి. అయితే, చిచ్చాతో అషుతో అలా రీల్స్ చెయ్యొద్దని హరి అంటున్నాడు.
''అషుతో రీల్స్ చేయకు. డోంట్ డూ దట్ విత్ అషు" అని చిచ్చాతో హరి చెప్పాడు. 'ఎందుకు?' అని అతడు ప్రశ్నించాడు. "నాకు నచ్చడం లేదు. నెక్స్ట్ టైమ్ అషు నీకు కాల్ చేస్తే... నువ్ రిజక్ట్ చెయ్. 'నాకు అలా చెయ్యడం ఇష్టం లేదు. నేను అటువంటి వాడిని కాదు' అని చెప్పు. ఇంట్రెస్ట్ లేదని చెప్పేయ్. ఏదోకటి చెయ్. రీల్స్ మాత్రం చెయ్యకు" అని హరి చెప్పాడు. దయచేసి అర్థం చేసుకోమని అన్నాడు. అయితే, అషుతో తనకు రీల్స్ చేయాలని ఉందని చిచ్చా చార్లెస్ చెప్పడం విశేషం. దాంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు గట్టిగా నవ్వారు.