English | Telugu

Karthika Deepam2: శివన్నారాయణకి డౌట్.. టెన్షన్ లో కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -496 లో.....సుమిత్ర గురించి కార్తీక్ వాళ్ళు టెన్షన్ పడుతారు. ఒకసారి నాన్నకి ఫోన్ చెయ్ అని కాంచన చెప్పగానే శివన్నారాయణకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. శివన్నారాయణ డల్ గా మాట్లాడడంతో నేను చెప్పాను కదా అత్త క్షేమంగా ఉంటుందని కార్తీక్ అనగానే తను వచ్చేదాకా మేం క్షేమంగా ఉంటామో లేదోనని శివన్నారాయణ అంటాడు.

దాంతో కాంచన ఫోన్ తీసుకొని నాన్న అలా మాట్లాడకండి అని ఎమోషనల్ అవుతుంది. పిల్లలు బాగుంటేనే కదా తండ్రికి సంతోషం అని శివన్నారాయణ అంటాడు. అప్పుడే శౌర్య అమ్మమ్మ అని అంటుంది. అది విని శౌర్య అమ్మమ్మ అంటుందేంటని కాంచనని శివన్నారాయణ అడుగుతాడు. దాంతో కాంచన డైవర్ట్ చేస్తుంది కానీ శివన్నారాయణ కి డౌట్ వస్తుంది. మరొక వైపు జ్యోత్స్నకి పారిజాతం క్లాస్ తీసుకుంటుంది. తప్పు చెయ్ కానీ నువ్వు చేసావని తెలియకూడదు. నువ్వేం చేస్తావో ఏమో కానీ మీ అమ్మని తీసుకొని రా అని చెప్తుంది.

ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి కార్తీక్ వచ్చి మావయ్య దగ్గరికి వెళదాం అత్త అని అంటాడు. నేను రానని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి డోర్ కొడుతాడు. దీప డోర్ తీస్తుంది తనని చూసి షాక్ అవుతుంది. కార్తీక్ అంటూ సుమిత్ర ఉన్న గది వైపుకి శివన్నారాయణ వెళ్తుంటే.. తాత అని కార్తీక్ పిలుస్తాడు. కార్తీక్, దీప టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.