English | Telugu

హోస్ట్‌గా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ రికార్డ్‌

మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా స్టార్ హీరోలు బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ ఆక‌ట్టుకుంటున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ జాబితాలో కింగ్ నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, రానా, త‌మ‌న్నా వంటి వారు రియాలీటీ షోల‌కు హోస్ట్ లుగా వ్య‌వ‌హ‌రించి త‌మ స‌త్తా చాటుకున్నారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోతో అల‌రిస్తున్నారు. రానా `నెం.1 యారీ` టాక్ షోతో ఆక‌ట్టుకోగా.. ఇదే త‌ర‌హాలో స‌మంత `సామ్ జామ్‌` షోతో ముందుకొచ్చింది.

అయితే ఈ జాబితాలో హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఎంటర‌వుతార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఆయ‌న హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికె`కు ఊహించ‌ని స్థాయిలో హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో ఇండియ‌న్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) విడుద‌ల చేసిన టాప్ రేటింగ్స్ లో టాప్ 10 రియాలిటీ షోల్లో ఒక‌టిగా నిలిచి రికార్డు నెల‌కొల్పింది.

Also Read: బిగ్‌బాస్ ఓటీటీ అత‌ని చేతికా?

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చాలా టాక్ షోలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి కానీ `ఆహా` ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికే' టాక్ షో సాధించినంత విజ‌యాన్ని ఇంత వ‌ర‌కు ఏ టాక్ షో సాధించ‌లేదు. వెండితెర‌పై ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన బాల‌య్య ఇప్పుడు `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బికె` అంటూ త‌న‌దైన స్టైల్లో స్టార్స్ ని ఇంట‌ర్వ్యూ చేస్తూ ఓ రేంజ్ లో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. అంతే కాకుండా సెల‌బ్రిటీల‌ను బాల‌య్య స‌ర‌దాగా ఆట‌ప‌ట్టిస్తున్న తీరు కూడా ఈ షోకి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తోంది. ఇప్ప‌టికే 7 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో మ‌రో మూడు ఎపిసోడ్ ల‌తో తొలి సీజ‌న్ ని కంప్లీట్ చేసుకోబోతోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.