'బంగార్రాజు'లో నామీద చైతూ పైచేయి సాధిస్తాడు!
on Jan 6, 2022

'మనం' సినిమాలో కలిసి నటించిన తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య మళ్లీ ఇప్పుడు 'బంగార్రాజు'లో కలిసి నటించారు. ఆరేళ్ల క్రితం నాగ్ డ్యూయల్ రోల్ చేసిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'సోగ్గాడే చిన్నినాయనా'కు ఇది సీక్వెల్. నాగ్ గతంలో పలు గ్రామీణ నేపథ్య సినిమాలు చేసి, మాస్‌లోకి వెళ్లిపోయారు. నాగచైతన్య ఇంతదాకా ఆ తరహా సినిమాలు చేయలేదు. ఆ ప్రకారం చూసుకుంటే.. చైతూకు ఇది ఫస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని చెప్పాలి.
Also read: 'రాధేశ్యామ్' ప్లేస్ లో 'బంగార్రాజు'.. సోగ్గాడి సంక్రాంతి సందడి షురూ
అయితే ఇప్పటికే 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీలో బంగార్రాజుగా నాగార్జున అలరించారు. ఈ మూవీలోనూ ఆయన అదే పాత్రలో కనిపించనున్నారు. ఒరిజినల్‌లో ఆయన జోడీగా నటించిన రమ్యకృష్ణ ఈ సీక్వెల్‌లోనూ నటించారు. ఇందులో చిన్నబంగార్రాజుగా చైతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒకవైపు తండ్రి ఉండగా, అతనికి ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే ప్రశ్న నాగ్‌కు ఎదురైంది.
Also read: 2022 కేరాఫ్ సీక్వెల్ మూవీస్!
బుధవారం జరిగిన ఆ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారాయన. "నాగచైతన్య ఇప్పటివరూ నేటివ్ ఫిల్మ్ చెయ్యలేదు. తన కెరీర్‌లో ఇది ఫస్ట్ నేటివ్ ఫిల్మ్. రూరల్ ఏరియాలో తిరిగే ఫిల్మ్. ఒక 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం', ఒక 'జానకిరాముడు' లాంటి సినిమాలు నా కెరీర్‌లో ఎలా హెల్ప్ అయ్యాయో చైతూ కెరీర్‌కే కాదు, తన యాక్టింగ్‌కు కూడా బాగా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం." అని చెప్పారు నాగ్. జనవరి 14న 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. అన్నట్లు తమ ఇద్దరిలో నాగచైతన్యే పైచేయి సాధిస్తాడని కూడా నాగ్ చెప్పడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



