English | Telugu
ఎపిసోడ్ 1111.. భాగ్యాన్ని కిడ్నాప్ చేసిన మోనిత... టెన్షన్‌లో వంటలక్క!
Updated : Aug 6, 2021
‘కార్తీక దీపం’ సీరియల్‌లో నేటి (ఆగస్టు 06, 2021) ఎపిసోడ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతోంది? అనేది పక్కన పెడితే... నేటి ఎపిసోడ్ సంఖ్య 1111. నంబర్‌లో మొత్తం నాలుగు ఒకట్లు ఉన్నాయి. సక్సెస్‌ఫుల్‌గా వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ డైలీ సీరియల్ నేడు వెయ్యినూట్ల పదకొండవ ఎపిసోడ్‌లో ఎంటరైంది. మరో మైలురాయి చేరుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే...
మోనితను కిడ్నాప్ చేయడానికి ఆమె ఇంటికి భాగ్యం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కార్తీక్ దగ్గర అంజి ఉన్నాడని అబద్ధం ఆడటంతో మోనిత పసిగట్టేస్తుంది. నిన్న జరిగిందిది. నేడు భాగ్యాన్ని మోనిత కిడ్నాప్ చేయడం సీరియల్‌లో కీలక మలుపు.
పిన్ని దగ్గరకు వెళ్తున్నానని డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌కు చెప్పిన వంటలక్క.. అంజి దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఫోన్ ఇంట్లో మర్చిపోవడం, వంటలక్క ఫోన్‌కు ఆమె పిన్ని భాగ్యం కాల్ చేయడంతో తనతో భార్య అబద్ధం చెప్పిందని డాక్టర్ బాబు పసిగడతాడు. ఇంటికి వచ్చిన దీపను నిలదీయడంతో ఆమె అసలు విషయం చెబుతుంది. అంజిని మోనిత కిడ్నాప్ చేసిన వీడియో చూపించి, అడ్రస్ చెప్పి మరీ భర్తను అక్కడికి పంపిస్తుంది.
అంజి దగ్గరకు డాక్టర్‌బాబు వెళతాడు. మోనిత మనిషి ద్రాక్షారామం నుండి తప్పించుకునే క్రమంలో డోర్ తీయగా... అంజి ముందు డాక్టర్ బాబు ప్రత్యక్షం అవుతాడు. మోనిత తనను కిడ్నాప్ చేసిందని డాక్టర్ బాబుతో అంజి చెబుతాడు. ఇంకా మోనిత చేసిన నేరాలను బయటపెడతాడు. ‘నీ మాటలను నేను నమ్మను’ అని డాక్టర్‌బాబు అనేసరికి... ‘నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. కానీ, మోనితను మాత్రం నమ్మవద్దు’ అంటాడు. అయితే డాక్టర్‌బాబు అతడి మాటల్ని కొట్టి పారేస్తాడు.
మరోవైపు భాగ్యం కిడ్నాప్ అవుతుంది కదా! ఆమె ఫోన్‌కు మురళీకృష్ణ కాల్ చేస్తాడు. రిసీవ్ చేసుకోకపోవడంతో వంటలక్క దగ్గరకు వస్తాడు. మురళీకృష్ణతో పాటు వంటలక్క కూడా భాగ్యానికి ఏమై ఉంటుందోనని కంగారుపడతారు. ఇవీ ఆగస్టు 06 ఎపిసోడ్ హైలైట్స్. మరోవైపు కుమారుడు కార్తీక్, మోనిత పెళ్లి గురించి ఆనందరావు టెన్షన్ పడటం, ఆదిత్య-శ్రావ్య కూల్ చేయడం జరిగాయి.