English | Telugu
'వకీల్ సాబ్' సాంగ్ పర్ఫార్మెన్స్‌కు కన్నీళ్లు పెట్టుకున్న గణేష్ మాస్టర్!
Updated : Aug 6, 2021
'ఢీ' అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఆడియన్స్‌కు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కాగా దొరుకుతుందని లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆగస్టు 11న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఆరు సినిమాలు ఆడియన్స్‌కు చూపించాలని ప్లాన్ చేశారు. స్టార్ హీరోల హిట్ సినిమాలను డాన్స్ షో రూపంలో ప్రజెంట్ చేస్తారన్నమాట. దీనికి తోడు టీమ్ లీడర్లు, జడ్జిలు సహా యాంకర్ కూడా సూపర్ స్టార్స్ మేనరిజమ్స్ తో సందడి చేయనున్నారు.
బ్లాక్‌బస్టర్ మూవీస్ స్పెషల్ థీమ్‌తో 'ఢీ' ఆగస్టు11 ఎపిసోడ్ ప్లాన్ చేశారు. 'నా దారి రహదారి...' అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గెటప్‌లో మంజుల వేదిక మీదకు వచ్చింది. ఆమె 'నరసింహ' సినిమాను పెరఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. మరో కంటెస్టెంట్ సాయి 'వకీల్ సాబ్'కు పెర్ఫార్మన్స్ చేశాడు. అతడి యాక్ట్ పూర్తయిన తర్వాత గణేష్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో 'ఒరేయ్! .... కొడుకుల్లారా? చిన్నపిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు??' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటువంటి పెర్ఫార్మన్స్ లు ఎప్పుడు ఎవరు చేసినా ఎమోషనల్ అయ్యే రష్మీ గౌతమ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
రజనీకాంత్ 'నరసింహ', పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలతో పాటు మహేష్ బాబు 'బిజినెస్ మేన్', నితిన్ 'జయం', 'సై', విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలకు కంటెస్టెంట్లు పెర్ఫార్మన్స్ చేశారు. మొత్తం మీద నెక్స్ట్ ఎపిసోడ్ సందడి సందడిగా జరగనుంది.