English | Telugu

జ్యోత్స్న  ఊహించిందే జరిగింది.. కావేరి సాయం చేసిందని తెలుసుకున్న శ్రీధర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -276 లో.... కావేరి దగ్గరికి దీప వచ్చి.. పూజకి రమ్మని ఆహ్వానిస్తుంది. అదంతా దూరం నుండి శ్రీధర్ చూస్తాడు. దీప వెళ్ళిపోయాక వచ్చి.. ఎవరో వచ్చినట్లు ఉన్నారని అడుగుతాడు. అవును పూజకి రమ్మని పిలిచారని కావేరి అంటుంది. ఎవరని శ్రీధర్ అడుగగా.. ఏదో సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. శౌర్య ఆపరేషన్ కి డబ్బు ఎవరు ఇచ్చారని జ్యోత్స్న ఆలోచిస్తూ పేపర్ పై అందరి పేర్లు రాస్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఎందుకు అలా రాసావని అడుగుతుంది.

డబ్బు ఎవరు ఇచ్చారని ఒక ఐడియా కోసమని జ్యోత్స్న అంటుంది. తాత ఇవ్వడు. డాడ్ తాతయ్యకి తెలియకుండా ఇవ్వడు.. మమ్మీ ఇవ్వలేదు.. కాశీ స్వప్నలకి అంత సీన్ లేదు. కావేరి ఇవ్వలేదు.. శ్రీధర్ మావయ్య ఇచ్చే ఛాన్స్ ఉందని జ్యోత్స్న గెస్ చేసి పారిజాతానికి చెప్తుంది. మరోవైపు కాంచన, అనసూయలు పూజకి కావల్సిన ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే దీప వస్తుంది. అందరిని పిలిచానని చెప్తుంది. స్వప్న, కాశీ లు హాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు జ్యోత్స్న అంటూ మాట్లాడుతుంటే దాస్ విని ఒక్కసారిగా లేచి బయటకు వెళ్తు.. అసలైన వారసురాలు అంటు ఉంటాడు. దాస్ ని స్వప్న, కాశీలు చూసి.. నాన్న ఎక్కడికి వెళ్తున్నావంటూ లోపలికి తీసుకొని వెళ్తారు. దాస్ పరిస్థితి చూసి కాశీ బాధపడతాడు.

మరొకవైపు శ్రీధర్ డ్రింక్ చెయ్యడానికి సిద్ధమవుతుంటే అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. తండ్రి, కొడుకులు ఒక్కటయ్యారు కదా కార్తీక్ కి యాభై లక్షలు ఇచ్చావ్ కదా అని అడుగుతుంది. అదేం లేదు నేను ఇవ్వలేదని శ్రీధర్ అనగానే మరి ఎవరు ఇచ్చి ఉంటారు.. అంత డబ్బు మీ ఇంటి నుండే సాయం అంది ఉందని అనుకుంటున్నాను.. కాంచన అత్త పూజ చేస్తుందంట, దీప పిలవడానికి వచ్చిందని జ్యోత్స్న అంటుంది. అక్కడికి కూడా వచ్చిందా అని శ్రీధర్ అంటాడు. అంటే అక్కడికి వచ్చిందా అని జ్యోత్స్న అడుగుగా లేదని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత కావేరిని పిలవడానికి దీప ఎందుకు వచ్చినట్లు అంటూ శ్రీధర్ బీరువా దగ్గరికి వెళ్లి డబ్బు ఉందో లేదో చూస్తాడు. లేకపోవడంతో బ్యాంక్ లో పని చేసే తన ఫ్రెండ్ కి కాల్ చేసి కావేరి ఎఫ్ డి కనుక్కుంటాడు. ఈ రోజే యాభై లక్షలు డబ్బు డ్రా చేసిందని చెప్పగానే.. శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.