English | Telugu

Karthika Deepam 2: శ్రీధర్ కి డౌట్.. తన సాలిడ్ పవర్ కార్తీక్ అంటున్న శివన్నారాయణ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -486 లో... కార్తీక్ కి వైరా వార్నింగ్ ఇస్తాడు. నీకు ఒక కుటుంబం ఉంది. చిన్న పాప ఉందని విన్నాను అని వైరా బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఊరికి ముందు పోతురాజు ఉంటాడు. నేను నా కుటుంబానికి పోతురాజుని అని కార్తీక్ తనని తనే హైలెట్ చేసుకుంటాడు. ట్రాన్స్ ఫార్మర్ ముందు డేంజర్ అని రాసి ఉంటుంది. నువ్వు ట్రాన్స్ ఫార్మర్ ముందున్నావ్ జాగ్రత్తా.... నీకు మొదటి పరిచయంలోనే పది కోట్లు నష్టం తీసుకొని వచ్చాను.. బోణి అదిరిందని కార్తీక్ అనగానే వైరాకి కోపం వస్తుంది.

మరొకవైపు అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసిందని దాస్ ని కాశీ అడుగుతాడు. అనవసరమైన విషయాలు కాకుండా జాబ్ గురించి ఆలోచించమని దాస్ అనగానే తండ్రి కొడుకులకి మాట మాట పెరుగుతుంది. నువ్వు నా కోసం ఏం చేసావ్.. నన్ను వదిలేసావని అనగానే కాశీ పై దాస్ చేయి చేసుకోబోయి ఆగిపోతాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి దాస్ ని అక్కడ నుండి పంపిస్తాడు. నువ్వు అలా అని ఉండాల్సింది కాదని కాశీతో శ్రీధర్ మాట్లాడతాడు.

శివన్నారాయణ, దశరథ్ ఇంటికి వచ్చి.. నిన్ను సీఈఓ గా తీసేస్తాం.. నువ్వే రాజీనామా చెయ్ అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. నాకు టైం ఇవ్వండి అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. వచ్చే వారం బోర్డు మీటింగ్ ఉంది.. అందరు ఎవరికి ఒకే చెప్తే వాళ్లే సీఈఓ అని శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. పదవి కంటే పరువు ముఖ్యం.. నువ్వే రాజీనామా చెయ్ అని జ్యోత్స్నకి సుమిత్ర సలహా ఇస్తుంది.

దాస్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. నీకు పుట్టినబిడ్డ పురిటిలోనే చనిపోయింది కదా.. జ్యోత్స్న నీ కూతురు ఒకే రోజు పుట్టారు కదా అని అడుగుతాడు. అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసింది. నా కొడుకు ఆ ఇంట్లో పని చెయ్యడానికి కారణం నీకు తెలుసా అని శ్రీధర్ అడుగుతుంటే.. నాకేం తెలియదని దాస్ అంటాడు. నేనే తెలుసుకుంటానని శ్రీధర్ అంటాడు. బావ కి డౌట్ వచ్చింది.. వదిలి పెట్టడు.. నేను జరిగేది చూస్తానని దాస్ అంటాడు.

మరొకవైపు కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వచ్చి మాట్లాడుతాడు. కాసేపు మనం తాత మనవడిలాగా మాట్లాడుకుందాం.. నేను ఎప్పుడైనా భయపడడం చూసావా.. నిన్న భయపడ్డాను.. నాకు సపోర్ట్ గా నువ్వు ఉంటావా.. నువ్వే నాకు సాలిడ్ సపోర్ట్ అని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.