English | Telugu

Karthika Deepam2 : దీపకి పుట్టబోయే బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలి జ్యోత్స్న.. దాస్ నిర్ణయం అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -524 లో..... దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే అందరు సంతోషపడతారు. పారిజాతం, జ్యోత్స్న మాత్రం షాక్ అవుతారు. ప్రెగ్నెంట్ అంటే ఏంటని శౌర్య అడుగుతుంది. నీకు ఆడుకోవడానికి తమ్ముడో చెల్లెలో వస్తుందని సుమిత్ర అనగానే నాకు మొన్న ఆడుకోమని బొమ్మ ఇచ్చింది.. అది చెల్లి అని పిలువు అంది.. నాకు చెల్లి వస్తుందని శౌర్య అంటుంది. అమ్మ నాకు కలలోకి వచ్చి చెప్పింది.. ఇప్పుడు నా మనవరాలిగా నా ఇంట్లో అడుగుపెట్టబోతుందని కాంచన అనగానే శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

జ్యోత్స్న కోపంగా పైకి వెళ్తుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. ఏంటి గ్రానీ వాళ్ళు చెప్పేది నిజమేనా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును అది ప్రెగ్నెంట్ అయితే నీకేంటని పారిజాతం అంటుంది. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని పంతులు చెప్పాడు కదా అని జ్యోత్స్న అనగానే దీప ప్రెగ్నెంట్ అయితే ఈ ఇంటి వారసురాలికి మంచి ఎలా జరుగుతుంది. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. లేదు బావ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ దీపకి అదృష్టం పట్టిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ ఎంట్రీ ఇచ్చి.. దీప ప్రెగ్నెంట్ అని స్వీట్ పంచుతాడు. మరొకవైపు పంతులు దగ్గర దీప, కార్తీక్ ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు వెళ్తూ వెళ్తూ.. దశరథ్, సుమిత్రలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దాంతో పంతులు బయటకు వచ్చాక.. అలా ఎందుకు అన్నారని శివన్నారాయణ అడుగుతాడు.

మీకు రాబోయే విపత్తు ఉంది.. దాని స్థాయి తగ్గడానికి హోమం చేసాను.. విపత్తు అయితే ఉందని పంతులు చెప్పగానే శివన్నారాయణ టెన్షన్ పడతాడు. మరొకవైపు దీప తల్లి కాబోతుందని కాంచన, అనసూయ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత దాస్ ని జ్యోత్స్న కలుస్తుంది. మీరు ఎప్పుడు దీప గురించి ఇంట్లో వాళ్లకి చెప్పకూడదని దాస్ తో జ్యోత్స్న అంటుంది. దీప బిడ్డ ఈ అంతఃపురంలోనే పుట్టాలని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.