English | Telugu

నమిత రాకతో కీలక మలుపు.. ఉత్కంఠగా ఎటో వెళ్ళిపోయింది మనసు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -154 లో.. రామలక్ష్మి ఇచ్చిన వార్నింగ్ కి శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఎందుకలా చేస్తున్నావని శ్రీలత తనపై కోప్పడుతుంది. ఆ రామలక్ష్మి తేడావస్తే మిమ్మల్ని ఆఫీస్ నుండి బయటకు పంపిస్తానని చెప్పిందని శ్రీవల్లి అనగానే.. అది చేసేకంటే ముందే నేనంటే ఏంటో చూపిస్తానని శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకంత్ లు వస్తుంటారు. మీ కోసం చూస్తున్న మొదటిసారి మీరు ఇద్దరు ఆఫీస్ కి వెళ్తున్నారు. రాహుకాలం కంటే ముందే ఆఫీస్ కి వెళ్ళాలని సీతాకాంత్ , రామలక్ష్మిలతో శ్రీలత అంటుంది.

అదేంటి అమ్మ.. మేమ్ ఫస్ట్ టైమ్ ఏం వెళ్లట్లేదు కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి కావాలనే నన్ను ఆశీర్వాదించండని శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను ఏది అనుకుంటే అది అయ్యేలా దీవించండని రామాలక్ష్మి అనగానే.. భలే ఇరికించావంటూ శ్రీలత దీవిస్తుంది. అత్తయ్య జాగ్రత్త టైమ్ కి టాబ్లెట్ వేసుకోండని రామలక్ష్మి అనగానే.. నా తర్వాత రామలక్ష్మి నీ గురించి ఆలోచిస్తుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు వెళ్ళిపోతారు. కాసేపటికి సందీప్ కూడా శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.

మరొకవైపు ముంబై బ్రాంచ్ నుండి నమిత అనే అమ్మాయి సీతాకాంత్ ఆఫీస్ కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నమిత ఆఫీస్ కి రాగానే ఎవరు అంటూ మాణిక్యం అడుగగా.. మార్కెటింగ్ డైరెక్టర్ అని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి ఎంప్లాయిస్ కి సందీప్, రామలక్ష్మి ని పరిచయం చేస్తాడు. అదేంటీ నా కూతురు జనరల్ మేనేజర్ కాదా అని మాణిక్యం అడుగగా.‌. అది నీకు అనవసరం అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నమిత వస్తుంది. తనని కూడా ఎంప్లాయిస్ కి పరిచయం చేస్తాడు. రామలక్ష్మి నా భార్య అంటూ నమితకి పరిచయం చేస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.