English | Telugu

రాజ్-కావ్య జంటని చూసి ఈర్ష్యపడిన స్వప్న.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. దుగ్గిరాల కుటుంబంలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన ‌కావ్యని ప్రపంచమంతా పరిచయం చేయడానికి రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. కాగా ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -51 లో.. నగలు, ఖరీదైన చీరలో కావ్యని చూసిన కనకం సంతోషపడుతుంది. మనం కావ్యకి అన్యాయం చేసినా దేవుడు మాత్రం న్యాయం చేసాడని మీనాక్షితో అంటుంది కనకం. మరోవైపు అమ్మ ఎక్కడ? కనిపించడం లేదని రేఖని అడుగుతాడు రాహుల్. తనకి జరిగిన అవమానానికి బయటకు రావడం లేదని రేఖ చెప్పగానే.. ముసుగు వేసుకొని పెళ్ళి చేసుకున్నవాళ్ళే సంతోషంగా తిరిగినప్పుడు, అమ్మకేంటి వెళ్ళి తీసుకొనిరా అని రేఖతో అంటాడు రాహుల్. ఇక రేఖ వెళ్తుంటే వెయిటర్ డ్రెస్ లో ఉన్న స్వప్నని చూస్తుంది. నిన్నెక్కడో చూసానని రేఖ అడుగగా.. ఇది వరకు కూడా ఇక్కడికి కూల్ డ్రింక్ సర్వ్ చెయ్యడానికి వచ్చాను. అప్పుడే చూసారని స్వప్న అనగానే.. "హా అవును కదా" అని రేఖ అనేసి వెళ్ళిపోతుంది.

దుగ్గిరాల ఫ్యామిలీ పరువుపోవాలని మీడియా వాళ్ళకి సైగ చేసి.. రాజ్ ని ప్రశ్నలు అడిగేలా చేస్తాడు రాహుల్. ఇక మీడియావాళ్ళు రాజ్ దగ్గరికి వచ్చి.. సర్ ఈ అమ్మాయిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారా? అని అడిగేసరికి రాజ్ కి కోపమొచ్చి.. "లేదు నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి. అనుకోని పరిస్థితులలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అయినా ఈ అమ్మాయి నా భార్య. నా భార్యకి గౌరవం ఇస్తాను చూడండి. నా భార్య ఈ నగలతో ఎలా ఉందో చూడండి" అని రాజ్ మీడియా వాళ్ళకి చెప్తుంటే.. పక్కనే ఉన్న కావ్య రాజ్ తో బిస్కెట్ అని అనేసరికి, రాజ్ కి కోపమొస్తుంది. ఇక రాజ్, కావ్య జంటను చూసిన స్వప్న.. "ఎక్కడో వీధుల్లో షాప్ పెట్టుకున్న దానికి ఈ ఆస్తి ఇదంతా దక్కింది. నేను ఉండవలసిన ప్లేస్ లో కావ్య ఉంది" అని ఈర్ష్యపడుతుంది స్వప్న.

సర్ మీ ఫొటోస్ తీసుకుంటామని మీడియా వాళ్ళు అనగానే.. సరే అంటాడు రాజ్. ఇక కావ్య మీద చేయి వేసి ఫొటోస్ దిగుతుంటే.. ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కావ్య. నాక్కూడా నువ్వు ఇబ్బంది పడడమే కావాలని రాజ్ అనుకొని, ఇంకా కావ్య దగ్గరికి జరుగుతాడు. కావ్య మెలికలు తిరుగుతు ఉంటుంది. ఆ తర్వాత జోకర్ వేషంలో ఉన్న కనకంని చూస్తుంది కావ్య. ఇంతలో కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. "వాళ్ళు మీ అమ్మ, పెద్దమ్మలే. నిన్ను చూడాలనుకుంటే నేనే అలా రమ్మని చెప్పాను" అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.