Read more!

English | Telugu

కృష్ణని అనుమానిస్తున్న మురారి.. గౌతమ్ ని కలవనిస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో.. కృష్ణ ఒంటరిగా కూర్చొని బాధపడుతుండగా తన దగ్గరికి మురారి వస్తాడు. రేపు వెళ్తున్నాను సర్ అని కృష్ణ చెప్తుంది. మళ్ళీ ఏమైంది, ఎందుకు? అని మురారి అడుగుతాడు. "నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోలేదు కదా.. ఇప్పుడు కింద పంచాయతీ పెట్టి ఎప్పుడెళ్తున్నావని అడిగారు. రేపు ఉదయం వెళ్తున్నానని చెప్పాను" అని కృష్ణ అనగానే.. ఎక్కడికి వెళ్తావని మురారి అడుగగా.. మా ఊరు వెళ్ళిపోతానని కృష్ణ చెప్తుంది.

మరోవైపు గౌతమ్, తన స్నేహితుడు కలిసి డ్రింక్ చేస్తుంటారు. అప్పుడే కృష్ణ ఫోన్ చేస్తుంది. గౌతమ్ లిఫ్ట్ చేయడు. "ఎందుకు ఇలా చేస్తున్నావ్? పాపం కృష్ణ నీ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది.. నువ్వు చెప్పే దానిపైనే తన కాపురం నిలబడి ఉందంట లేకపోతే తనని ఇంట్లో నుండి పంపిస్తారట" అని గౌతమ్ ఫ్రెండ్ అంటాడు. "పాపం కృష్ణ నా వల్ల ఇబ్బందుల్లో పడకూడదు. ఎలాగైనా సరే తనని కలిసి నా గతం చెప్పాలి" అనుకుంటాడు గౌతమ్. మరోవైపు కృష్ణ బాధపడుతూ.. రేపు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటూ తనకి సంబంధించిన లగేజ్ సర్దుకుంటుంది. అప్పుడే మురారి వచ్చి.. నిజంగానే వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. "వెళ్ళిపోతాను సర్.. గౌతమ్ సర్ ని కలవలేకపోయాను" అనేసరికి మురారికి ఇంకా కోపమొస్తుంది. కృష్ణ ఎప్పుడు గౌతమ్ గురించి ఆలోచించేసరికి.. తనపై మురారికి డౌట్ వస్తుంది. వన్ ఇయర్ వరకు అగ్రిమెంట్ మ్యారేజ్ అని మర్చిపోయి, నాకు దగ్గర అవుతుందని అనుకుంటే ఇలా చేస్తుందేంటని కృష్ణని అపార్థం చేసుకుంటాడు మురారి.

మరుసటి రోజు ఉదయం కృష్ణ కిందకి వస్తుంది. నాకు ఒక గంట పర్మిషన్ కావాలి.. నేను బయటకు వెళ్ళి వచ్చాక వెళ్ళిపోతానని ఇంట్లో వాళ్ళతో  అంటుంది. ఆ తర్వాత కృష్ణకి గౌతమ్ మెసేజ్ చేస్తాడు. "నిన్ను కలవాలి, నా గురించి నీకు చెప్పాలి" అని మెసేజ్ చేసి, తను మెసేజ్ చేసిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దని గౌతమ్ చెప్తాడు. అందుకే కృష్ణ గంటసేపు పర్మిషన్ కావాలని చెప్తుంది. కృష్ణ బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని మురారి అడుగుతాడు. గౌతమ్ సర్ ని కలవడానికి అని చెప్పగానే.. నేను నిన్ను వెళ్ళనివ్వనని మురారి కోపంగా తన చెయ్యి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.