English | Telugu

భార్యాభర్తల మధ్యలో కలుగజేసుకునే సంస్కారం మాకు లేదన్న జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -718 లో.. రిషి, వసుధార కలిసి భోజనం చేస్తుంటారు. "సర్.. వంటలు బాగా చేసావ్.. ఎప్పుడు నువ్వే చేయ్ వసుధార అనొచ్చు కదా" అని వసుధార అంటుంది. ఇప్పుడు బాగా చేసావ్ వసుధార అని పొగడాలా.. చేసిన వంటలు తినాలంతే అని రిషి అంటాడు.

ఆ తర్వాత రిషి కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. కాలేజీకి స్పాట్ వాల్యుయేషన్ వచ్చిందని ఇతర ఫాకల్టీతో మీటింగ్ లో చెప్తాడు. అందరూ క్లాప్స్ తో అభినందనలు తెలుపుతారు. "ఎలాంటి తప్పులు లేకుండా అందరం కలిసి పనిచేద్దాం. దీనికి సంబంధించినవన్ని జగతి మేడం చూసుకుంటారు" అని రిషి చెప్తాడు. ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. అలా జగతి, మహేంద్ర ఇంటికెళ్ళగానే.. రిషి ఎక్కడున్నాడు? వసుధారతో కలిసి ఎక్కడ షికారులు చేసి వస్తున్నాడు? అని జగతిని దేవయాని అడుగుతుంది. మాకేం తెలియదు అక్కయ్య, భార్యభర్తల మధ్యలో కలుగజేసుకునే సంస్కారం కొందరిలాగా మాకు లేదని జగతి చెప్పేసి వెళ్ళిపోతుంది. మరోవైపు కాలేజీ అయిపోయిన తర్వాత కూడా వర్క్ చేస్తున్న వసుధార దగ్గరికి రిషి వస్తాడు. "ఏంటి కాలేజీ ముగిసాక కూడా వర్క్ చేస్తున్నావా? అందరం ఈ వర్క్ లోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ వర్క్ చేయడం అవసరమా? వెళ్దాం పదా" అని వసుధారని రిషి అంటాడు. సరే అని అన్నీ సర్దుకుని రిషి కంటే ముందే వెళ్తుంది. రిషి కోపంగా చూసేసరికి ఆగి.. తన వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది వసుధార.

ఆ తర్వాత ఇంట్లో అందరు భోజనం చేస్తూ కాలేజీ విషయాలు మాట్లాడుకుంటారు. ఈ స్పాట్ వాల్యుయేషన్ ఏమో గాని.. రిషి పైన ఎక్కువ భారం ఉంటుందని దేవయాని అనగా.. అదేం లేదు మేడం మేము అందరం వర్క్ షేర్ చేసుకుంటున్నామని వసుధార అంటుంది. ఆ తర్వాత కాలేజీ వర్క్ చేస్తున్న వసుధారని చూసి, ఈ టైం వరకు పడుకోకుండా వర్క్ చేస్తున్నావా అంటాడు రిషి. వసుధారకి కాఫీ కలుపుకొని తీసుకొని వస్తాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.