English | Telugu

కాస్ట్‎లీ కారు కొన్న ప్రియాంక.. డ్రైవింగ్ నేర్చుకోరా బాబు అన్న కాజల్

ప్రియాంక సింగ్ ఇండస్ట్రీలోకి జబర్ధస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సాయి తేజగా ఫేమస్ అయ్యింది. తర్వాత ముంబై వెళ్లి లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా మారక పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 5 లోకి కంటెస్టెంట్‌గా వెళ్ళింది. ఇక ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్న కలలు నెరవేర్చడం కోసం ఇల్లు కూడా కట్టించి ఇచ్చింది. ఇప్పుడు హ్యుందాయ్ వెర్నా కార్ ని కొనుక్కుంది. తానే పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టింది. ఆ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

"13 ఏళ్ల కలలు, శ్రమ ఎట్టకేలకు ఫలించాయి. ఈ రోజు నేను నా కలలను సాకారం చేసుకుంటున్నాను ..ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే , నాకు వెన్నుదన్నుగా నిలిచిన సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు చెప్పాల్సిన క్షణం ఇదే అని తెలుసుకున్న..నేను హైదరాబాద్‌కి మొదటిసారి రూ.150తో వచ్చి కష్టపడి పని చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. నా జీవితాన్ని నా కలలకు అనుగుణంగా మార్చుకున్న రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది.

నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ నేను అనుకున్నది సాధించడంలో సహాయపడింది. ఇది ప్రారంభం మాత్రమే ...ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి 2024కి శుభాకాంక్షలు" అంటూ చెప్పింది ప్రియాంక సింగ్. ఈమె కార్ కొన్నదని తెలిసిన శ్రీహాన్ " తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టెయ్.." అని కామెడీ కామెంట్ పెట్టాడు. తర్వాత అష్షు కూడా "నువ్వు గ్రో అవుతున్నావు అలాగే గ్లో కూడా అవుతున్నావు" అంటూ చెప్పింది అలాగే హమీద "కంగ్రాట్యులేషన్స్" అని చెప్పింది. కాజల్ ఆర్జే మాత్రం " అభినందనలు రా పనిలో పనిగా డ్రైవింగ్ కూడా నేర్చుకో...2023 నుండి చెప్తుంటే 2024 లో కొన్నావ్..డ్రైవింగ్ ఇంకెప్పుడు నేర్చుకుంటావో ఏమో" అంది. ఇలా ప్రియాంక ఫ్రెండ్స్ అంతా ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ పెడుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.