English | Telugu
నలుగురికి వెన్నుపోటు పొడిచిన తనూజ.. మహానటి సావిత్రి: జబర్దస్త్ అవినాష్!
Updated : Nov 23, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ పూర్తయింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఒకరు, సెలెబ్రిటీ ఒకరు వచ్చారు. మొదటగా భరణి వాళ్ల అమ్మ , సెలెబ్రిటీ నాగబాబు వచ్చారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ వాళ్ల బ్రదర్ , అవినాష్ వచ్చారు.
ఇక అవినాష్ వచ్చీ రాగానే అందరికి హాయ్ చెప్పి.. తనూజ నా మనసులో ఉందని చెప్పాడు. ఇక పక్కనే ఉన్న సంజన నేను కూడా హాయ్ చెప్పాను మీరు చెప్పలేదని అడుగగా.. నేను వాట్సప్ చేశాను.. బయటకు వచ్చి చూస్కోండి అని అన్నాడు. నన్ను టాప్-5 కి పంపించడయ్యండి సర్ అని అవినాష్ అనగానే డైరెక్ట్ టాప్-5 ఆ అని నాగార్జున షాక్ అయ్యాడు. అవినాష్ మళ్ళీ హౌస్ లోకి వస్తాడంట అని ఇమ్మాన్యుయల్ తో నాగార్జున అనగానే.. ఎన్నిసార్లు వస్తావ్ అన్నా అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఇక రీతు చౌదరితో కాసేపు ఆడుకున్నాడు ఇమ్మాన్యుయల్.
కాసేపటికి బాక్స్ లో కొన్ని ఫోస్టర్ లు ఉన్నాయి. అవి బాక్స్ లో నుండి తీసి చూపించి హౌస్ మేట్స్ లో ఎవరికి సూట్ అవుతాయో చెప్పమని నాగార్జున అడిగాడు. అవినాష్ బాక్స్ లో చేయి పెట్టిన తర్వాత మొదటగా మహానటి పోస్టర్ వచ్చింది. దీనిని ఎవరికిస్తావని నాగార్జున అడిగితే తనుజ గారు అని ఠక్కున చెప్పాడు అవినాష్. ఎందుకని తనూజ అడిగితే మీరు గొప్ప నటి అండి మహానటి అని చెబుతున్నానంటూ అవినాష్ మాట్లాడాడు. అది కూడా చాలా కామెడీగా చెప్తూ ఇంత అందంగా ఉన్నారని మాట్లాడాడు. తరువాత కట్టప్ప పోస్టర్ వచ్చింది. అది కూడా తనుజాకి ఇచ్చాడు ఇమ్మాన్యుయల్. మీరు బేసిగ్గా హౌస్ లో సపోర్ట్ లేదని ఫీల్ అవుతున్నారు. ఆవిడ సపోర్టు లేదని ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మళ్లీ తనుజ మాట్లాడుతూ కట్టప్పకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అవినాష్ అంటూ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. దీని ప్రకారం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి వెన్నుపోటు పొడిచిందంటూ అవినాష్ చెప్పాడు. ఇక హౌస్ లో టాప్-5 ఎవరో పెట్టమన్నాడు నాగార్జున. మొదటి స్థానంలో ఇమ్మాన్యుయల్, రెండో స్థానంలో తనూజ, మూడో స్థానంలో కళ్యాణ్, నాల్గవ స్థానంలో సుమన్ శెట్టి, ఇక చివరి స్థానంలో రీతూ చౌదరిని పెట్టాడు అవినాష్. ఆ తర్వాత అందరికి బై చెప్పేసి వెళ్లిపోయాడు.