English | Telugu

Jayam serial : గంగ ఇంటికోడలు అవుతుందా‌.. అబద్ధం చెప్పించడానికి ఆ ఇద్దరు ప్రయత్నం!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -98 లో.....రుద్ర అకాడమీకి వస్తాడు. ఎవరు స్టూడెంట్స్ రాకపోవడంతో డల్ గా ఉంటాడు. అప్పుడే పెద్దసారు వచ్చి ఏం డిస్సపాయింట్ అవ్వకూ వస్తారని చెప్తాడు. అప్పుడే పారు వచ్చి అది జరగదు.. ఎవరు రారు ఒకవేళ వచ్చిన ఈ అగ్రిమెంట్ చూపిస్తానని పారు అంటుంది. అప్పుడే గంగ కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకొని అకాడమీకి వస్తుంది. ఏంటి రోడ్డుపై ఎవరు కన్పిస్తే వాళ్ళని తీసుకొని వచ్చావా అని పారు అంటుంది.

అలా కాదు వాళ్లు చదువుకునేవాళ్ళు.. అన్నింట్లో ముందున్నా వాళ్ళు.. పాపం తమ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు.. అంతేకాక ఆర్థిక స్థోమత లేని వాళ్ళు అని గంగ అనగానే అలా చెప్పు అని పారు వెటకారంగా మాట్లాడుతుంది. నాకు కావాలిసింది కూడా అదే అని రుద్ర అంటాడు. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మీలా గొప్పగా చెయ్యండి అని రుద్రతో గంగ అంటుంది. మరొకవైపు ఒక స్వామి దగ్గరికి ఇషిక, వీరు వెళ్లి మేం చెప్పినట్లు మా ఇంటికి వచ్చి గంగ మీ ఇంటికి కొడలు అవుతుందని చెప్పండి అని చెప్తారు. అలా అబద్ధం చెప్పడం ఏంటి.. అదే నిజం అని స్వామి అనగానే స్వామిని తిట్టుకుంటు ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు ఇక్కడ ఎవరికో కాలుతున్నట్లు ఉందని పారుని ఉద్దేశ్యించి గంగ, పెద్దసారు మాట్లాడుకుంటారు. దాంతో పారు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ప్రీతి కిచెన్ లో వంట చేస్తుంటే ఎవరు చెయ్యనివ్వరు. అప్పుడే శకుంతల వచ్చి స్నేహా పెద్దనాన్నని పిలువు అంటుంది. రుద్ర అన్నయ్యతో నాన్న అకాడమికి వెళ్లాడని ప్రీతీ చెప్తుంది. అకాడమీకి ఎందుకు.. నిన్న ఓడిపోయాడు కదా.. ఎవరు జాయిన్ అవుతారు మూసేస్తాడు అకాడమీ అని శకుంతల కోపంగా మాట్లాడతుంది. మరొకవైపు ఇషిక, వీరు ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు. తనకు ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.