English | Telugu
Jayam serial : మార్టిన్ కి నిజం చెప్పిన వీరు.. గంగ మాటలని శకుంతల నమ్ముతుందా!
Updated : Oct 29, 2025
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -96 లో.....రుద్రని ఓడించాలని మార్టిన్ తో పారు అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. మరొకవైపు రుద్రని పోటీలో చంపేస్తే నీకు రెండు కోట్లు ఇస్తానని మార్టిన్ తో డీల్ కుదుర్చుకుంటాడు వీరు. రుద్ర, మార్టిన్ పోటీపడుతారు మొదటి రౌండ్ కి రుద్ర విన్ అవుతాడు. మీ తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలుసు నువ్వు ఓడిపోతే నిజం చెప్తానని మార్టిన్ అనగానే రుద్ర సెకండ్ రౌండ్ కి ఓడిపోతాడు. ఆ తర్వాత వీరు చెప్పినట్లు రుద్రని మార్టిన్ ని చంపాలని ట్రై చేస్తాడు. దాంతో ముందే పసిగట్టిన రుద్ర తన కాలు విరగ్గొడతాడు.
ఆ తర్వాత రుద్ర దగ్గర గంగ వాళ్ళు వచ్చి ఎందుకు ఓడిపోయారని అడుగుతారు. అప్పుడే పారు వస్తుంది. నువ్వు రాంగ్ రూట్ లో ఎటాక్ చేసి మార్టిన్ ని ఆడకుండా చేసావ్.. నువ్వు ఓడిపోయినట్లే అని పారు అనగానే తను అలాగే చేసాడు.. నేను అలా చేశాను.. అలాగని మార్టిన్ గెల్వలేదు.. నేను ఓడిపోలేదని పారుకి రుద్ర స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. మార్టిన్ ని కార్ ఎక్కించి రుద్ర కంట కనపడకుండా వెళ్ళమని వీరు చెప్తాడు. అసలు వాళ్ళ తమ్ముడిని చంపింది ఎవరని మార్టిన్ అడుగుతాడు. నేనే అని వీరు తన పగ గురించి మార్టిన్ కి చెప్తాడు. అదంతా గంగ విని షాక్ అవుతుంది.
ఆ తర్వాత గంగ పెద్దసారు ఇంటికి వెళ్లి ఇన్ని రోజులుగా రుద్ర సర్ దోషి అనుకుంటున్నారు కానీ అసలు దోషి ఎవరో తెలిసింది.. అంతా చేస్తుంది ఈ వీరు సర్ అనగానే అందరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావని వీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. రుద్ర వాళ్ళ తమ్ముడిని ఎవరు చంపారో నిజం నాకు చెప్పండి అని మార్టిన్ అనగానే వీరు సర్ చెప్పారు.. అసలు ఆ మార్టిన్ తో వీరు సర్ నే అలా చెప్పించి ఉంటాడని గంగ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని శకుంతల కోప్పడుతుంది. గంగ చెప్పింది నిజమే వీరు తప్పు చేసాడనట్లేదు కానీ మార్టిన్ మాత్రం నాతో అలాగే అన్నాడని రుద్ర అంటాడు. ఇక ఇషిక, వీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.