English | Telugu

Bigg Boss 9 Telugu : దొంగలుగా తనూజ, సుమన్ శెట్టి, దివ్య సూపర్ గేమ్.. ఊహించని ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం హౌస్ లో దొంగలు పడ్డారు. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఓ వింత టాస్క్ ఇచ్చాడు. వాంటెడ్ పేట అంటూ దానిలో గజదొంగలుగా సంజన, మధురి ఉన్నారంటూ బిగ్ బాస్ చెప్పాడు. రెడ్ టీమ్ లీడర్ గా మాధురి, బ్లూ టీమ్ లీడర్ గా సంజన ఉండగా.. వారి టీమ్ లలోని దొంగలు టాస్క్ టాస్క్ కి మారిపోతున్నారు. ఆ వివరాలు ఓసారి చూసేద్దాం..

నిన్నటి(బుధవారం) ఎపిసోడ్ లో .. మాస్ మాధురి-సంజన సైలెన్సర్ ఇద్దరు తమ గ్యాంగ్స్‌తో కలిసి హౌస్‌లో వీరంగం చేస్తున్నారు. అయితే తనూజ-సుమన్ శెట్టి కలిసి సంజన టీమ్ క్యాష్‌ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేశారు. దీంతో సంజన టీమ్ హర్ట్ అయిపోయి మేము ఇక గేమ్ ఆడమనేసింది. ఇది చూసి మాధురి కూడా సపోర్ట్ చేసింది. కొట్టేసింది తనూజ-సుమన్-దివ్య కలిసి పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలిసి నిజంగానే డబ్బులు కొట్టేశారా అని తనూజని మాధురి వెళ్లి అడిగింది. కానీ తనూజ నాకేం సంబంధం లేదు నేను తీయలేదంటూ అబద్ధం చెప్పింది. దీనికి హర్ట్ అయి అలిగిన మాధురి కిచెన్‌లోకి వెళ్లింది. ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని తనూజ వస్తే మాధురి గట్టిగానే రియాక్ట్ అయింది. ఆపెయ్ తనూజ నాకు చిరాకు.. నన్ను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను.. నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాను.. నాకు గేమ్ అవసరం లేదు.. నాకు మనుషులే ముఖ్యమంటూ రియాక్ట్ అయింది మాధురి. ఇంతలో రీతూ వచ్చి నీకు టీమ్‌ ముఖ్యం కాదా అంటూ తనూజపై ఫైర్ అరిచేసింది. అంటే టీమ్ బొక్క వాళ్ల దృష్టిలో అంటూ నోరు జారింది.

మాధురి తన టీమ్ కి సపోర్ట్ చేయడంతో ఆమెపై సంజన ఫుల్ ఫైర్ అయింది. దివ్య నువ్వు మా క్యాష్ తీశావా అని అడిగింది. నేను తీయలేదు నాకు గుర్తులేదు.. అంటూ దివ్య చెప్పడంతో సంజన కోప్పడింది. ఓకే రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం.. ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది. దీంతో దివ్య కోప్పడింది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా.. అన్ ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిర్‌యే.. మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో సంజన హర్ట్ అయింది. మరోవైపు తనూజ-సుమన్ శెట్టి కలిసి కొట్టేసిన క్యాష్ గురించి టీమ్ అంతా పట్టుబట్టడంతో మాధురి చివరికి ఒక డీల్ చేసింది. తనూజ వాళ్లు సంజన టీమ్‌కి చెందిన ఆరు వేల బీబీ క్యాష్ కొట్టేశారు. అందులో మూడు వేలు తనూజ-దివ్య-సుమన్ ఉంచేసుకొని మూడు వేలు మాత్రమే మాధురికి ఇచ్చారు. దాంతో పాటు గోలీసోడా టాస్క్ గెలిచినందుకు వచ్చిన రెండు వేల క్యాష్ కలుపుకొని మొత్తం ఐదువేలని టీమ్ మెంబర్స్‌కి పంచేసింది మాధురి. ఇక తన కోటాలో వచ్చిన ఆరు వేల క్యాష్‌ని దాచినట్లు మాధురి చెప్పింది. ఇప్పటికి ఈ టాస్క్ లో రెడ్ టీమ్ టాప్ లో ఉంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.