English | Telugu
Jayam serial: గంగకి పట్టీలు గిఫ్ట్ గా ఇచ్చిన రుద్ర.. ఫ్లాప్ అయిన వీరు కిడ్నాప్ ప్లాన్!
Updated : Nov 2, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -100 లో... రుద్ర ఇచ్చిన పట్టీలు చూసి గంగ మురిసిపోతుంది. అవి నీకు ఎక్కడివి అని లక్ష్మీ అడుగుతుంది. ఒకరు గిఫ్ట్ ఇచ్చారని గంగ చెప్తుంది. అప్పుడే పైడిరాజు వస్తాడు. ఎక్కడ ఆ పట్టీలు చూస్తాడో అని తల్లికూతుళ్లు ఆ పట్టీలు అతని కంట పడకుండా జాగ్రత్తపడతారు.
మరొకవైపు రుద్ర ఇంటికి వస్తాడు. పెద్దసారుతో మాట్లాడుతుంటే రుద్రకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతుంటే రుద్ర జేబులో నుండి పట్టీలు కొన్న రిసీప్ట్ కిందపడుతుంది. అది చూసి నువ్వు పట్టీలు తీసుకున్నావా.. ఎవరికి అని పెద్దసారు అడుగుతాడు. గంగకి తీసుకున్నా.. తను నాకూ అకాడమీ విషయంలో హెల్ప్ చేసింది.. డబ్బు ఇస్తే తీసుకోలేదు.. అందుకే గిఫ్ట్ ఇచ్చానని రుద్ర చెప్తాడు. అదంతా శకుంతల వింటుంది. స్వామి అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది.
మరొకవైపు గంగకి మార్టిన్ కనిపిస్తాడు. ఆ విషయం రుద్రకి గంగ ఫోన్ చేసి చెప్తుంది. అంతలోనే గంగని వీరు మనిషి కిడ్నాప్ చేస్తాడు. గంగ ఏదో ప్రాబ్లమ్ లో ఉందని రుద్రకి అర్థమవుతుంది. మరొకవైపు శకుంతల, ఇషిక ఇద్దరు లక్ష్మీ దగ్గరికి వస్తారు. నీ కూతురు నా ఇంటికి కోడలు కావాలని చూస్తుంది. నిన్న రుద్ర ఇచ్చిన పట్టీలు తీసుకుందని శకుంతల చెప్తుంది. శకుంతల ఇరవై రూపాయలు ఇచ్చి ఇది మీ స్థాయి అని చెప్తుంది. దాంతో లక్ష్మీ హర్ట్ అవుతుంది. ఇంకెప్పుడు మా గంగ మీ ఇంటివైపు రాదని వాళ్ళతో లక్ష్మీ చెప్తుంది.
మరొకవైపు రౌడీలు గంగని తీసుకొని వెళ్తారు. గంగని సేవ్ చెయ్యడానికి రుద్ర వస్తాడు. అమ్మాయిని కిడ్నాప్ చేసినవాళ్ళు తన దగ్గర ఫోన్ లాక్కోవాలి కదా లొకేషన్ ట్రేస్ చేసి వచ్చాను.. మీరంతా ప్రొఫెషనల్ కిడ్నాపర్లు కాదా అని రుద్ర అంటాడు. గంగ నన్ను ఫాలో అవుతూ వాళ్ళని కొట్టు అని గంగకి రుద్ర ట్రైనింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో గంగ మెడలో తాళి కట్టమని పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.