English | Telugu
Jayam Serial : అత్తారింట్లో కొత్త కోడలు వేసిన ముగ్గు.. రన్నింగ్ చేయమన్న భర్త!
Updated : Nov 25, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -123 లో......గంగకి అరిటాకు ఇచ్చి అందులో భోజనం పెట్టి ఒక మూలన తినుపోమని శకుంతల అంటుంది. ఇది నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాను.. శుభకార్యాలయాల్లో ఇలాగే భోజనం పెడతారని గంగ ఒక పక్కకి వెళ్లి భోజనం చేస్తుంది. దాంతో రుద్ర, పెద్దసారు భోజనం చెయ్యకుండానే వెళ్ళిపోతారు. మరొకవైపు పారుని ఇషిక, వీరు కలుస్తారు.
ఆ గంగని అత్తయ్య ఒక పనిమనిషిలాగే చూస్తుంది. నువ్వు అనుకున్నది చెయ్యడానికి ఇంకా నీకు అవకాశం ఉందని పారుతో ఇషిక అంటుంది. అవునా అని పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగని శకుంతల అవమానించింది పెద్దసారు గుర్తుచేసుకొని దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలనుకుంటాడు. అప్పుడే రుద్ర వచ్చి నేను గంగని తనకి కంఫర్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళమని అంటున్నా అని చెప్తాడు. నువ్వు తాళి కట్టిన భార్య ఎక్కడికి వెళ్ళదు అర్థం అయిందా అని పెద్దసారు చెప్తాడు. ఇంతకు నువ్వు అలా అంటే గంగ ఏమందని పెద్దసారు అడుగుతాడు. మీరు నా భర్త.. ఇది నా అత్తారిల్లు.. ఎక్కడికి వెళ్ళనని చెప్పింది అని రుద్ర అనగానే తను క్లారిటీగానే ఉందని పెద్దసారు అంటాడు. మరుసటిరోజు గంగ ఉదయం లేచి ముగ్గు వేస్తూ పాట పాడుతుంది. ఇంట్లో అందరు లేచి వస్తారు. ముగ్గు చాలా బాగుంది గంగ అని పెద్దసారు అంటాడు. కోడలు అంటే ఇలా ఉండాలని గంగ ని పెద్దసారు పొగుడుతాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని పారుతో పెద్దసారు అంటాడు. అదే అంకుల్ ఇక నుండి అలోచించి నిర్ణయం తీసుకుంటానని పారు అంటుంది. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారని రుద్ర అడుగుతాడు. గంగ ముగ్గు వేసిందని పెద్దసారు చెప్తాడు.
ఈ ముగ్గు కంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే బాగుండేది కదా అని రుద్ర అంటాడు. ఈ ముగ్గుని పాడు చేస్తానని పారు వాటర్ పైప్ పగులగొడుతుంది. ముగ్గు పాడైతే నేను భోజనం చెయ్యనని గంగ అనగానే రుద్ర వెళ్లి వాటర్ రాకుండా చేస్తాడు. గంగ కూడా వెళ్తుంది. అది చూసి పారు ఇంకా కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.