English | Telugu
Jayam serial : గంగకి అడుగడుగునా అవమానేలా..శకుంతల టార్చర్ షురూ!
Updated : Nov 24, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -122 లో.... గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. ఇంట్లోకి రావద్దని శకుంతల అడ్డుపడుతుంది. అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళ ముందు తప్పక శకుంతల వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నిన్ను అందరి ముందు ఇంట్లోకి రమ్మన్నాను కదా అని కోడలిగా ఒప్పుకున్నట్లు కాదు.. నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి పనిమనిషివే అని శకుంతల అంటుంది. గంగ దగ్గరికి స్నేహ, ప్రమీల, ప్రీతీ, వంశీ వెళ్లి మాట్లాడుతారు.
నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం చాలా హ్యాపీగా ఉందని అంటారు. దాంతో గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర ఒక్కడే జరిగింది కూర్చొని బాధపడతాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు. పెద్దనాన్న నేను చేసింది తప్పా అని అడుగుతుంది. వంద శాతం కరెక్ట్ అని పెద్దసారు అంటాడు. గంగ మెడలో అయితే తాళి కట్టాను కానీ ఇదంతా జరుగుతుందని నాకు తెలియదని రుద్ర ఫీల్ అవుతాడు. ఆ తర్వాత గంగ అత్తారింటికి వెళ్లిందని తన ఫోటో చూస్తూ లక్ష్మి బాధపడుతుంది. మరొకవైపు గంగ ఇక్కడే ఉంటే తనని టార్గెట్ చేస్తారు.. తనని ఇక్కడ నుండి పంపించాలని రుద్ర అనుకుంటాడు. అప్పుడే గంగ వస్తుంది. గంగ నీ మెడలో ఎలాంటి పరిస్థితిలో తాళి కట్టానో నీకు తెలుసు కానీ నీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదని రుద్ర అనగానే గంగ నవ్వుతు ఆ విషయం నాక్కూడా తెలుసు కదా అని అంటుంది.
నువ్వు ఈ పెళ్లి విషయం మర్చిపోయి నీకు కంఫర్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళిపో అంటాడు. అయితే ఈ తాళిని ఏం చెయ్యమంటారు. ఒకసారి తాళి పడ్డాక కష్టం అయినా నష్టం అయినా అతనితోనే అని గంగ అంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. గంగ పాయసం చేసి తీసుకొని వస్తుంది. వాటిని శకుంతల కింద పడేస్తుంది. శకుంతల భోజనం చేస్తుంది. గంగ నువ్వు వచ్చి రుద్ర పక్కన కూర్చోమని పెద్దసారు అనగానే గంగ వస్తుంటుంది. అప్పుడే ఇషికతో శకుంతల అరిటాకు తెప్పించి గంగకి ఇస్తుంది. అరిటాకులో భోజనం పెట్టి అక్కడ ఒక మూలాన కూర్చోమని శకుంతల అనగానే గంగ ఏం ఫీల్ అవ్వకుండా శుభకార్యాలు అయినప్పుడు అరిటాకులో భోజనం పెడతారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.