English | Telugu

Jayam serial : బాక్సింగ్ లో గెలిచిన గంగ.. రుద్ర పెళ్ళి చేసుకున్నాడని తెలుసుకున్న కుటుంబం!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -117 లో.. గంగ మెడలో తాళి కట్టి రుద్ర తన వెంట బాక్సింగ్ పోటీ దగ్గరికి బయల్దేరతాడు. మరొకవైపు టైమ్ అవుతుంది.. అకాడమీ తరుపున ఎవరు పార్టిసిపేట్ చెయ్యకపోతే మీకు ఫైన్ ఉంటుందని ఒకతను వచ్చి రుద్ర అకాడమీ కోచ్ కి చెప్తాడు. అప్పుడే ఆ అకాడమీలో ఉన్నతను కోచ్ దగ్గరికి వచ్చి గంగని రుద్ర సర్ పెళ్లి చేసుకొని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడట అని కోచ్ కి చెప్తాడు.

అప్పుడే గంగని తీసుకొని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైమ్ లేదు వెళ్లి పార్టిసిపేట్ చెయ్ అని గంగని రుద్ర పంపిస్తాడు. గంగ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోతుంది. దాంతో రుద్ర తనని మోటివేట్ చేస్తాడు. ఆ తర్వాత రుద్ర పెళ్లి మండపానికి బయల్దేరతాడు. గంగ తనని అవమానించిన వాళ్ళని గుర్తుచేసుకొని పోటీలో తనకి ఉన్న అపోజిట్ పర్సన్ ని ఓడిస్తుంది. దాంతో బాక్సింగ్ లో గంగ గెలుస్తుంది. ఇక ఆ తర్వాత అందరు వచ్చి తనని అభినందనలు చెప్తుంటారు అయితే తను మాత్రం రుద్ర సర్ ఎక్కడ అని కోచ్ ని అడుగుతుంది. సర్ పని ఉందని వెళ్ళాడని కోచ్ చెప్తాడు. మరొకవైపు రుద్ర ఎక్కడికి వెళ్ళాడని అందరు వెయిట్ చేస్తారు.

అప్పుడే రుద్ర వస్తాడు. రుద్ర వచ్చావా అని పారు తనని చెయ్ పట్టుకొని తీసుకొని వెళ్లిపీటలపై కూర్చోపెట్టి తాళి కట్టమంటుంది. రుద్ర చేతిలోకి తాళిని తీసుకుంటాడు. అదే సమయంలో గంగ మెడలో తాళి కట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు రుద్ర. అప్పుడే పారు వాళ్ళ అన్న హరి ఫోన్ లో ఏదో చూసి ఆపండి అంటాడు. తరువాయి భాగంలో గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడనే నిజం అందరికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.