English | Telugu

ప్రాణాపాయ స్థితిలో జగతి.. శైలేంద్ర ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -878 లో.. శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకున్న ధరణి వెంటనే వసుధారకి ఫోన్ చేసి.. రిషి ఎక్కడ ఉన్నాడు. మా ఆయన ఏదో ప్లాన్ చేశాడు కానీ అదేంటో నాకు తెలియదు. నువ్వు రిషి దగ్గరికి వెళ్ళు. చిన్న అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. చిన్న అత్తయ్య రిషిని కలవడానికి వెళ్ళిందని చెప్తుంది.

ఆ తర్వాత పాండియన్ ని తీసుకొని వసుధార వెళ్తుంది.. మరొక రౌడీ జగతిని ఫాలో అవుతుంటాడు. మరొకవైపు రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని పాండియన్ ని రిషి కి ఫోన్ చేయమని వసుధార చేయమని చెప్తుంది. రిషికి పాండియన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాడు. మీ ఇద్దరు విడిపోవడానికి కారణం నేనే ఇప్పుడు మీ ఇద్దరిని నేను కలుపుతాను. మీరెప్పుడు కలిసే ఉండాలని వసుధార, రిషిల గురించి జగతి అనుకుంటుంది.ఆ తర్వాత జగతి, రిషి ఇద్దరు ఒక దగ్గరకి వస్తారు. రౌడీ కూడా వచ్చి దూరంగా ఉంటాడు.

ఏంటి మేడమ్ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారని రిషి అనగానే.. జగతి బాధగా నేను ఫోన్ చేస్తే టార్చర్ లాగా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. మరొక వైపు శైలేంద్రకి రౌడీ ఫోన్ చేసి.. రెడీ గా ఉన్నానని చెప్తాడు. మరొక వైపు ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నారు చెప్పండని జగతిని రిషి అడుగుతాడు. జగతి ఏదో చెప్తుంటే అప్పుడే వసుధార, పాండియన్ ఇద్దరు వస్తారు. మేడమ్ మనం ఇక్కడ నుండి వెళదామని వసుధార టెన్షన్ పడుతుంది. లేదు నేను నిజం చెప్పాలని వచ్చాను చెప్తానని జగతి అంటుంది.

ఆ తర్వాత ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని వసుధార అంటుంది. ప్లీజ్ ఈ రోజుతో నిజం తెలిపోవాలి. మేడమ్ ని చెప్పనివ్వండని వసుధారపై రిషి కొప్పడతాడు. రిషికి జగతి నిజం చెప్పబోతుంటే పై నుండి రౌడీ గన్ తో రిషి వైపు గురి పెడతాడు. అది చూసిన జగతి వెంటనే రిషికి అడ్డుగా వెళ్తుంది. ఆ బుల్లెట్ జగతికి తగులుతుంది. దాంతో జగతి కిందపడిపోతుంది. వెంటనే జగతిని రిషి, వసుధార, పాండియన్ లు హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మరొక వైపు శైలేంద్రకి ఆ రౌడీ ఫోన్ చేసి జరిగిందంత చెప్తాడు. మరొక వైపు మహేంద్రకి జరిగింది తెలిసి.. హాస్పిటల్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఫణింద్రకి తెలిసి శైలేంద్రకి చెప్తాడు. ఫణీంద్ర అలా చెప్పగానే ఏం తెలియనట్లు యాక్ట్ చేస్తూ.. పదండి హాస్పిటల్ కి వెళ్దామని అంటాడు. మరొక వైపు జగతి పరిస్థితి చూసి రిషి, మహేంద్ర లు ఎమోషనల్ అవుతుంటే.. వసుధార వాళ్ళకి బాధపడకండని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.