English | Telugu

ముకుందకి వార్నింగ్ ఇచ్చిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -272 లో.. మురారిని ముకుంద జల్లెడ లో నుండి చూడడం కృష్ణ చూసి బాధపడుతుంది. ఆ తర్వాత మధుని అలేఖ్య జల్లెడ లో నుండి చూస్తుంది. కాసేపటికి కృష్ణ కోసం మురారి ఇల్లంతా చూస్తుంటాడు.

ఆ తర్వాత ముకుంద చెప్పినట్లుగా అలేఖ్య కావాలనే మురారికి అబద్దం చెప్తుంది. కృష్ణ పైన ఉందని చెప్పగానే మురారి పైకి వస్తాడు. ఆ తర్వాత అలేఖ్య అబద్ధం చెప్పినందుకు టెన్షన్ పడుతుంది. ఇక అక్కడిని వెళ్లిన మురారి అటు ఇటు చూస్తాడు. మురారి రాగానే ముకుంద వెనకాల నుండి హగ్ చేసుకుంటుంది. మురారి కోపంగా వదులమని అన్నకూడా వదలకుండా మురారిని ముకుంద గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇక నా వల్ల కాదు భవాని అత్తయ్య దగ్గరికి వెళ్లి మన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చెయ్యమని అడుగుతా అని ముకుంద అనగానే.. నీకు ఎన్ని సార్లు చెప్పాలి.

నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావంటు మురారి అంటాడు. మరొక వైపు పైకి ఎవరు రాకుండ చూస్తున్న అలేఖ్య దగ్గరికి రేవతి వస్తుంది. రేవతి రాగానే అలేఖ్య టెన్షన్ పడడం చూసి.. ఏంటని అడుగుతుంది. తలతిక్కగా మాట్లాడేసరికి రేవతికి కోపం వచ్చి చెంపపై ఒక్కటిస్తుంది. దాంతో అలేఖ్య నిజం చెప్పేస్తుంది. మురారిని ముకుంద పైకి పంపించమని చెప్పి ఎవరు రాకుండా చూడమని చెప్పిందని అలేఖ్య అనగానే.. ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చెప్పి, రేవతి కోపంగా అక్కడ నుండి పైకి వెళ్ళిపోతుంది.

మరొక వైపు ముకుందని విడిపించకోవడం మురారి ట్రై చేస్తాడు. అప్పుడే రేవతి వచ్చి వెనకాల నుండి హగ్ చేసుకొని ఉన్న ముకుందని చూస్తుంది. అదే సమయంలో ముకుందని మురారి గట్టిగా తోస్తాడు. రేవతి కోపంగా మురారిని కొట్టబోతు.. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. మురారి సైలెంట్ గా ఉంటాడు. మురారి తప్పేం లేదని ముకుంద అనగానే.. నువ్వు వెళ్ళు అని మురారిని పంపిస్తుంది రేవతి. నేను మురారి లేకుండా బ్రతకలేను అత్తయ్య, నన్ను అర్థం చేసుకొండని రేవతికి ముకుంద చెప్పగానే.. రేవతి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.