English | Telugu

పృథ్వి కి ... ప్రపోజ్ చేసిన విష్ణుప్రియ

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నబీల్, సీత, విష్ణుప్రియ, ప్రిథ్వి వచ్చారు. ఇక మళ్ళీ విష్ణు ప్రియా, ప్రిథ్వి లవ్ స్టోరీ మొదలయ్యింది. ఇక విష్ణు ప్రియా రాగానే "చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు ఒకటే సేమ్ గా ఉంటాయి..అవి కళ్ళు. మన ముక్కు పెరిగినట్టు మన కళ్ళు పెరగవు. ఇక విష్ణు ప్రియా కాన్సంట్రేషన్ ప్రిథ్వి మీద పడింది. ఆయన బుగ్గలు చూడండి గులాబీ జామూన్స్ లా ఉన్నాయి" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సుమ ఐతే విష్ణు ప్రియా, ప్రిథ్వితో "మీరు ఇప్పుడు ఒక హాంటెడ్ హౌస్ కి టూర్ కి వెళ్ళబోతున్నారు" అని చెప్పింది. దాంతో విష్ణు అక్కడ దెయ్యం మీరేనా అంటూ సుమ మీద సెటైర్ వేసింది. దానికి సుమ వెంటనే కౌంటర్ ఇచ్చింది. "నువ్వు ఉండగా నేనెందుకు అవుతా దెయ్యం..ఐనా నీకు దెయ్యం కనపడినా కూడా హహహ అనే నవ్వుతావుగా " అంది. ఇక సుమ వీళ్ళతో రాపిడ్ ఫైర్ ఆడించింది.

"ఈరోజు సుమ అడ్డా షోకి రావడానికి ముఖ్యమైన కారణం. ఏ. ఈ ప్రోగ్రాంకి యాంకర్ సుమ కాబట్టి బి. విష్ణు ప్రియా కోసం" అని అడిగింది. "విష్ణు ప్రియా కోసం" అని ప్రిథ్వి చెప్పాడు. ఆ ఆన్సర్ కి తట్టుకోలేని సుమ "గో అవుట్ ఆఫ్ మై షో" అనేసింది. "మీ తోటి యాంకర్స్ నీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు. ఏ. శ్రీముఖి బి. సుడిగాలి సుధీర్" అనేసరికి "సుడిగాలి సుధీర్" అని ఆన్సర్ ఇచ్చింది విష్ణు. "శ్రీముఖికి నాకు మధ్య ఎం జరిగిందో తెలిస్తే షాకవుతారు" అంటూ ఒక థంబ్ నైల్ ని సుమ చెప్పేసరికి అవును అంటూ క్లారిఫై చేసింది విష్ణుప్రియ. "కాండిల్ లైట్ డిన్నర్ కి ఎవరితో వెళ్తావు ఏ. జె.డి. చక్రవర్తి బి. ప్రిథ్వి" అనేసరికి "ప్రిథ్వి" అని చెప్పింది విష్ణుప్రియ. ఇక ఇద్దరూ కలిసి "చూపుల్తో గుచ్చి గుచ్చి" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. "విష్ణు ప్లీజ్ ఒప్పుకో ఐదేళ్ల నుంచి నీ వెంట పడుతున్నా" అంటూ చెప్పాడు ప్రిథ్వి. "నాకు చిరాకు తెప్పించకు" అని విష్ణు అనేసరికి వెంటనే ఒక రెడ్ రోజ్ తెచ్చి మోకాలి మీద కూర్చుని ప్రొపోజ్ చేసాడు. "ఈ ప్రపంచమంతా వెలేసినా నువ్వు నా వేలు పట్టుకుంటే నేను ఈ ప్రపంచాన్నే ఏలేస్తా" అంటూ చెప్పుకొచ్చాడు ప్రిథ్వి. దాంతో షాకైన విష్ణు ప్రియా "ఐ లవ్ యు ప్రిథ్వి" అని చెప్పింది.