English | Telugu
నీ రాముడిని ఎప్పుడు తెచ్చుకుంటావ్ ఫైమా!
Updated : Feb 1, 2024
సీతారాముల కళ్యాణం కోసం ఆనాడు లోకమంతా ఎదురు చూసారు. ఇప్పుడేమో ఫైమా కళ్యాణం కోసం తన అభిమానులతో పాటుగా నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే తను నవ్వినా , ఏడ్చినా, ఏం చేసిన సపోర్ట్ గా నిలుస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఫైమా. ఆ సీజన్ కి బెస్ట్ కమెడీయన్ గా నిలిచింది. సంచులకొద్దీ పంచులతో ఉతికారేసింది. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనివిధంగా హౌస్ లో తన కామెడీ సెన్స్ తో నవ్వులు పూయించింది. పటాస్ షోతో తనలో కూడా కామెడీ చేసే సత్తా ఉందని నిరూపించుకొని జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది. అక్కడ రాణించడంతో తనకి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం లభించింది. హౌస్ లో అందరికి కామెడీని పంచిన ఫైమా తనలో కూడా ఎమోషనల్ బాండింగ్ ఉందని.. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పడంతో ఆ సీజన్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ తెచ్చుకుంది ఫైమా. ఇక హౌస్ నుండి బయటకొచ్చాక బిబి జోడీ డ్యాన్స్ లో పాల్గొన్న ఫైమా విజేతగా నిలిచింది.
ఫైమా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ట్రెండింగ్ రీల్స్ చేస్తుంటుంది. కొత్త ఫోటోషూట్ లతో, రీల్స్ తో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఫైమా ప్రస్తుతం 566k ఫాలోవర్స్ ని కలిగి ఉంది. బటర్ ఫ్లై బటర్ ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అంటూ సాగే పాటకి తను ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేయగా అది మిలియన్ వ్యూస్ ని చేరుకుంది. ఇక ఇప్పుడు ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. " నీ రాముడిని ఎప్పుడు తెచ్చుకుంటావ్ అక్క" అని ఒకరు అడుగగా.. ఏమో తెల్వట్లే కుదిరితే మీరు తెచ్చివండి అని అంది. ఏమైంది అక్క బంగారం.. నువ్వు అలా ఉంటే అస్సలు చూడలేం. నువ్వుతనే బాగుంటావ్. నవ్వుతూ ఉండు అక్క అని ఒకరు అడుగగా.. తను నవ్వుతున్న ఓ వీడియోని రిప్లై గా ఇచ్చింది. ఎందుకు అక్క అంత క్యూట్ గా ఉన్నావ్ అని ఒకరు అడుగగా.. అబద్దం అంతా అబద్ధమని ఫైమా రిప్లై ఇచ్చింది. ఇలా తన అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడింది ఫైమా. కాగా ఇప్పుడు ఫైమా ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది.