English | Telugu

మూడో కాన్పుకు అన‌సూయ రెడీ?!

అనసూయ మరోసారి ప్రెగ్నెంట్‌ కానుందా? మూడో బిడ్డకు జన్మనివ్వనుందా? నెక్ట్స్‌ వీక్‌ టెలికాస్ట్‌ కాబోయే ‘జబర్దస్త్‌’ ప్రోమో చూస్తే... ఇటువంటి సందేహాలు కలగడం సహజమే! ‘అదిరే’ అభి మాటకు మాటగా... స్పాంటేనియస్‌గా, సరదాగా అనసూయ చెప్పిందేమో! అయితే, ఆమె మాటలే హైలైట్‌ అయ్యాయి.

‘టైమ్‌కు అన్నం తిను. పులుపు తినాలని అనిపిస్తే... నేను మామిడిపళ్లు అవీ పంపిస్తా’ – అనసూయతో అభి అన్న మాటలివీ. వెంటనే ఏమాత్రం తడుముకోకుండా ‘టైముంది దానికి’ అని అనసూయ చెప్పింది. ప్రెగ్నెంట్‌ లేడీస్‌కి పులుపు తినాలని అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో అభి అన్నట్టు అక్కడ సీన్‌ కనిపించింది. దానికి తోడు అభి స్కిట్‌లో ఫీమేల్‌ ఆర్టిస్ట్‌ ‘ఏంటి అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు?’ అంటే... ‘తొమ్మిదో నెల కదే’ అన్నాడు. ‘అనసూయకు మళ్లీ తొమ్మిదో నెలా?’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పుడు అసలు విషయం బయటపెట్టారు. ‘నాకు కాదు... అందరికీ తొమ్మిదో నెలే ఇది’ అని అనసూయ అన్నది.

అయితే... ముందు ‘పులుపు తినడానికి టైముంది’ అని అనసూయ అనడంతో మళ్లీ గర్భం దాల్చడానికి, మరో బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె సిద్ధంగా ఉందని పలువురు భావిస్తున్నారు. ఆల్రెడీ భరద్వాజ్, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.

నెక్ట్స్‌ వీక్‌ ‘జబర్దస్త్‌’లో స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని రోజులుగా షోకి దూరమైన ‘రైజింగ్‌’ రాజు, మళ్లీ ‘హైపర్‌’ ఆదితో కలిసి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో పాటు ప్రోమోలో ‘జయం’ స్పూఫ్‌తో ‘చలాకీ’ చంటి టీమ్‌ సందడి చేసింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.