English | Telugu
మరోసారి నవీనకు రింగ్ తొడిగిన సత్య!
Updated : Sep 4, 2021
టీవీ తార, నిర్మాత నవీన యాట, తన ఫ్యామిలీతో కలిసి ప్రకృతి సౌందర్యానికి నిలయమైన సిక్కింలో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. 'నవీన.. ది అల్టిమేట్ చానల్' పేరుతో సక్సెస్‌ఫుల్‌గా యూట్యూబ్ చానల్‌ను కూడా ఆమె రన్ చేస్తోంది. ఇటీవల ఇండో-చైనా బోర్డర్ సమీపంలో ఉన్న సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్, దాని పరిసర ప్రాంతాల్లో భర్త సత్యనారాయణ, ఇద్దరు కుమారులతో హాలిడే ట్రిప్‌కు వెళ్లింది నవీన.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విరివిగా వర్షాలు పడుతున్నాయి. శీతల ప్రదేశమైన గ్యాంగ్‌టక్‌లోనూ అదే పరిస్థితి. చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరోసారి తన భార్యకు మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు సత్య. అంతేకాదు, ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి, ఆ చేతిని ప్రేమగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత లేచి నిల్చున్న అతని నుదుటి మీద తను కూడా ప్రేమతో ముద్దుపెట్టింది నవీన. అంతే! సత్య కూడా గట్టిగా ఆమె బుగ్గను చుంబించాడు. మెరూన్ కలర్ గౌన్‌లో నవీన గార్జియస్‌గా మెరిసిపోయింది.దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిందామె.
2003లో టీవీరంగంలోకి యాంకర్‌గా అడుగుపెట్టిన నవీన, తర్వాత నటిగా మారి పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత భర్త సత్యతో కలిసి యాట మూవీ ఫెస్టివల్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి 'కలవారి కోడళ్లు', 'పెళ్లినాటి ప్రమాణాలు' లాంటి సీరియల్స్ నిర్మించింది. వాటిలో తనూ నటించింది. ఆర్కా మీడియా వర్క్స్ టీవీ వింగ్‌కు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం తన యూట్యూబ్ చానల్‌లో రకరకాల కాన్సెప్టులతో రూపొందించిన వీడియోలను పోస్ట్ చేస్తూ వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది.