English | Telugu
బిడ్డని కోల్పోయిన తర్వాత అవినాష్ మొదటి వ్లాగ్!
Updated : Jan 23, 2024
కొన్ని రోజుల క్రితం ముక్కు అవినాష్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అది చూసి అందరు షాక్ అయ్యారు. కొన్ని కారణాల వల్ల మా బిడ్డని కోల్పాయమంటూ అవినాష్ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ తో ఒక్కసారిగా తన అభిమానులే కాదు నెటిజన్లు కూడా బాధపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అది గడిచిన వారం తర్వాత గానీ ముక్కు అవినాష్-అనూజ బయటకు రాలేదు.
జబర్దస్త్ ద్వారా అవినాష్ తెలుగు టీవీ ప్రేక్షకలకి దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో ముక్కుతో స్కిట్ చేసి అది సూపర్ హిట్ అవ్వడంతో అతనికి ముక్కు అవినాష్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళొచ్చాడు. ఇక బయటకొచ్చక అనూజని పెళ్ళి చేసుకొని యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు. అనూజ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి ప్రతీది వ్లాగ్స్ గా చేస్తున్న అవినాష్.. కొన్నిరోజులుగా వ్లాగ్స్ చేయడం లేదు. దానికి కారణం అవినాష్ కి దూరంగా ప్రెగ్నెన్సీ కోసం అనూజ తన అమ్మగారింటికి వెళ్ళగా బిడ్డని కోల్పోయి మళ్ళీ వచ్చేసింది. ఇక తనని చూసి ఎమోషనల్ అయ్యాడు అవినాష్. తనొచ్చాక తనని తాను చూసుకొని నువ్వు లేకపోతే కేరింగ్ తీసుకోలేదు. బాగా బ్లాక్ అయ్యానని అనూజతో అవినాష్ అన్నాడు. ఇక నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం వెలవెలా అని పాడిన అవినాష్ .. ఇక నాకు ఆ టెన్షన్ లేదు. నువ్వు వచ్చేసావ్ కదా అని అనూజతో అన్నాడు. ఆ తర్వాత తన బేబీని గుర్తుకుచేసుకుంటు ఎమోషనల్ అయ్యాడు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి తెగ కామెంట్లు వస్తున్నాయి.
అక్కడ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడంతో.. ఇక్కడ అనూజ, అవినాష్ కలిసి గుడికి వెళ్లి పూజలు చేశారు. అది చూసిన నెటిజన్లు .. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు.. మీ బేబీని నిజంగానే కోల్పోయారా? డెలివరీ వ్లాగ్ చేయండి బ్రో అంటు కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే అవినాష్ దంపతులు బేబీని లాస్ అయ్యారా? లేక అవన్నీ వైరల్ కోసం చేశాడా.. మళ్ళీ అవినాష్ ఈ వీడియోలెందుకు చేస్తున్నాడు.. ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు అవినాష్ ఏం సమాధానం చెప్తాడో తెలియాల్సి ఉంది.