English | Telugu
అన్‌స్టాపబుల్ 2.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!
Updated : Sep 17, 2022
ఆహా వేదికపై "అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె" టాక్ షో దుమ్ము లేపడానికి రెడీ అవుతోంది. దీనికి సంబందించి ఒక పోస్టర్ ని ఆహా యాజమాన్యం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆహాలో ప్రసారమైన ఈ షో ఫస్ట్ సీజన్ అదరగొట్టడమే కాదు మంచి టీఆర్పీలు కూడా సొంతం చేసుకుంది. ఎందుకంటే బాలయ్య సెలబ్రిటీస్ తో ఓపెన్ గా అన్ని విషయాలు మాట్లాడడమే. ఇక ఆడియన్స్ కు కూడా ఈ షో ఎంతో నచ్చేసింది. మోహన్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బోయపాటి శ్రీను, రవితేజ, రాజమౌళి వంటి సెలబ్రిటీలు ఈ షోలో పార్టిసిపేట్ చేశారు.చివరగా మహేష్ తో గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చారు.
ఇప్పుడు సెకండ్ సీజన్ స్టార్ట్ అవడానికి టైం వచ్చేసింది. "త్వరలో పండగ ప్రారంభం కానుంది.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా" అంటూ టాగ్ లైన్ పెట్టి ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఐతే ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనే విషయం మాత్రం ప్రస్తుతానికిసస్పెన్స్ గా ఉంచారు. దసరాకి ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బాలయ్య బాబు అంటే ఎప్పుడూ రాష్ గా కోపంతో కనిపిస్తారని టాక్ ఉంది ఇండస్ట్రీలో. కానీ అవన్నీ నిజాలు కావని ఈ షో ఫస్ట్ సీజన్ చూసిన వారికి ఈపాటికే అర్థమైపోయింది. ఆయనకి మనసులో ఏదనిపిస్తే దాన్ని మొహమాటం లేకుండా, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు అనే పేరు వచ్చింది. ఇక ఫస్ట్ సీజన్ కూడా బాలయ్యబాబులో మరో కోణాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది.