English | Telugu
హౌస్‌లో ఉత్తమ నటుడు శ్రీహాన్.. ఉత్తమ నటి శ్రీసత్య!
Updated : Sep 17, 2022
బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. కెప్టెన్సీ టాస్క్ లో డీజే పాటలకు కంటెస్టెంట్స్ డాన్సులు వేసి ఇరగదీసారు. కెప్టెన్సీ పోటీలో రాజశేఖర్‌కి ఎక్కువ వచ్చాయి. నాలుగు ఓట్లతో ఆయన కెప్టెన్ అయ్యారు. మూడు ఓట్లు ఆర్జే సూర్యకి, రెండు చంటికి, ఒకటి ఇనయకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ హౌస్ లోకి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మూవీ హీరో హీరోయిన్స్ సుధీర్‌బాబు, కృతి శెట్టి వచ్చి సందడి చేశారు.
చిత్ర ప్రమోషన్లో భాగంగా హౌజ్ లో కాసేపు రచ్చ చేశారు. తర్వాత కొన్ని మూవీస్ సీన్స్ లో యాక్ట్ చేసి చూపించారు హౌస్ మేట్స్. ఇందులో రేవంత్ "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో" అంటూ పోకిరి సీన్లు చేశాడు.ఆ తర్వాత గీతూ రాయల్ `బుజ్జిగాడు`లోని ప్రభాస్‌లా చేసింది. శ్రీహాన్, ఫైమా మంచి కామెడీ చేశారు. `పోకిరి`లోని లిఫ్ట్ ఎపిసోడ్ చేసి నవ్వులు పూయించారు.
రాజశేఖర్, శ్రీ సత్య కలిసి `ప్రేమ కథా చిత్రమ్` సీన్లు చేసి నవ్వు తెప్పించారు. సప్తగిరి వాయిస్ తో శ్రీహాన్ బాగా నటించాడు. హౌజ్‌లో ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఉత్తమ నటుడిగా శ్రీహాన్, ఉత్తమ నటిగా శ్రీసత్య మెమెంటోస్ గెలుచుకున్నారు.
తర్వాత హౌజ్‌లో మళ్ళీ మాములుగా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. చంటిపై కామెంట్స్ చేశాడు రేవంత్. ఇక హౌస్ లోకి వచ్చిన సుధీర్ బాబు, కృతి శెట్టి ఫుల్ ఎంటర్టైన్ చేయించి మరీ వెళ్లారు.