English | Telugu

హౌస్‌లో గొడవలు మొదలు!

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ డే నుంచే రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా క్లాస్-మాస్-ట్రాష్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్స్ పోటీకి దిగారు. "స్లైడ్ జరా స్లైడ్ జరా" అనేటాస్క్ లో భాగంగాసింగర్ రేవంత్ తో త‌ల‌ప‌డిన‌ అభినయశ్రీ ఓడిపోయింది. తర్వాత 'రోల్ బేబీ రోల్' టాస్క్ లో నేహా చౌదరి, ఇనయా సుల్తానా తలపడ్డారు. పాచికలను పోలిన బాక్సులను నిర్ణయించినప్రదేశంలో పెట్టాల్సినఈ టాస్క్ లో నేహా చౌదరి గెలిచింది.

ఇనయ ఓడిపోయేసరికి తనకు ఈ గేమ్ లో ఎవరి సపోర్ట్ దొరకలేదని బాధపడింది. ఆదిరెడ్డి,రేవంత్ ఇద్దరూ ఆమెకు నచ్చజెప్పారు. ఇక క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ పూర్తయ్యే సమయానికి క్లాస్ లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యార‌ని ప్రకటించాడు. ఇక ట్రాష్ లో మిగిలిన అభినయశ్రీ, బాలాదిత్య, ఇనయ ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించారు. ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నందుకు ఆ ముగ్గురు ఫుల్ ఖుషి అయ్యారు.

మరో పక్క టాస్క్స్, ఎలిమినేషన్స్ గురించి భర్త రోహిత్ తో ఏదో సీరియస్ గా చెప్పబోయి అద్దంలో బాడీ చూసుకుంటూ వింటుండేసరికి కోపంతో, "చెప్పేది విను లేదంటే బాడీ అయినా చూసుకో" అంటూ విసుక్కుంది. అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఫైనల్ గా 21 మంది కంటెస్టెంట్స్ లో కొందరు సేవ్ అయ్యారు. కొందరు డేంజర్ జోన్ లోకి వెళ్లారు. ఫస్ట్ వీక్ హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యేదెవరో చూడాలి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..