English | Telugu
రెండు రోజులు షూటింగ్ చేశాక బాలకృష్ణ సినిమాలోంచి నన్ను తీసేశారు!
Updated : Sep 7, 2022
'సరిలేరు నీకెవ్వరు' మూవీలో "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ ఐపోయిన నటిసంగీత'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సంగీత ఇప్పటికీ యంగ్ గా ఉంది అంటూ అలీ ఇన్డైరెక్ట్‌గా అన్నాడు. "సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ తల్లిగా చేసావ్ కదా.. అది నీకు ప్లస్ అయ్యిందా మైనస్ అయ్యిందా?" అని అడిగా అలీ."రెండూ" అని సమాధానం ఇచ్చింది సంగీత. "అనిల్ రావిపూడిని ఇప్పటికీ తిడుతుంటాను, అలా చేయించినందుకు"అంటూ కామెడీ చేసింది.
తర్వాత 'మసూదా' మూవీ టీమ్ నుంచి హీరో హీరోయిన్స్ ఐన తిరువీర్, కావ్య వచ్చారు. ఈ చిత్రం హారర్ కమ్ థ్రిల్లర్ మూవీగా ఎంటర్టైన్ చేయబోతోందని చెప్పింది కావ్య. "నీ చిన్నప్పుడే డేట్స్ తీసుకున్నారట కదా.. ఇప్పుడు బిగ్ స్టార్స్" అని అలీ అడిగేసరికి, కావ్య నవ్వేసి "అల్లు అర్జున్ గారు అన్నారు నువ్ పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా చేయాలని.. నేను కూడా నవ్వేసి నేను హీరోయిన్ అయ్యేసరికి మీరు ముసలోళ్ళు ఐపోతారు అన్నాను" అంది కావ్య.
"నీకొచ్చిన అవకాశాల్లో ఇది ఎందుకు వదులుకున్నాను అని ఫీల్ అయ్యింది ఏదన్నా ఉందా?" అని సంగీతను అడిగాడు అలీ."బాలకృష్ణ గారి సినిమా కోసం ఒక రెండు రోజులు షూటింగ్ చేసాను. తర్వాత అందులోంచి నన్ను తీసేసారు" అని షాకింగ్ విషయం చెప్పింది సంగీత.