English | Telugu
రామరాజు ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. భద్రవతి డిజప్పాయింట్!
Updated : Nov 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -305 లో.. వేదవతి ఇంకా తన ముగ్గురు కోడళ్ళు కలిసి శోభని వెతుక్కొని తీసుకొని వచ్చి ధీరజ్ ని విడిపిస్తారు. థాంక్స్ అన్నయ్య.. మీరు నన్ను కాపాడారు కానీ ఆ విషయం మా నాన్నకి తెలియక మీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని ధీరజ్ తో శోభ అంటుంది. చూసారా నా కొడుకులని తప్పు చేసేలా పెంచలేదు.. అది నా కొడుకులు అంటే అని రామరాజు తన కొడుకుల గురించి గొప్పగా చెప్తాడు.
మరొకవైపు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది విశ్వ.. ఆ రామరాజు ఇల్లు చీకటి అయిందని భద్రవతి అంటుంది. ఇప్పుడే మనకి అసలైన దీపావళి అని సేనాపతి అంటాడు. అందరూ సంతోషంతో క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. అప్పుడే రామరాజు కుటుంబం దీపావళి సెలబ్రేషన్స్ కి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం షాక్ అవుతుంది. నా కొడుకు గురించి ఎవరో తప్పుగా మాట్లాడారు.. వాడు ఒక అమ్మాయి జీవితం కాపాడాడని ధీరజ్ గురించి రామరాజు గొప్పగా చెప్తాడు. ఇప్పుడు మొదలు పెట్టండ్రా టపాసులు పేల్చడం అని రామారాజు అనగానే ధీరజ్ టపాసులు స్టార్ట్ చేస్తాడు.
ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి థాంక్స్ అని చెప్తాడు. నాకు ఇలా హెల్ప్ చెయ్యడం అలవాటు అని ప్రేమ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. అసలు ఎలా ఆ శోభని సేవ్ చేశారని ధీరజ్ అడుగుతాడు. నాలో కూడా పోలీస్ దాగుంది అని ప్రేమ అనగానే ధీరజ్ నవ్వుతాడు. నీ హైట్ కి పోలీస్ అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దమ్ముంటే రేపు ఇద్దరం రన్నింగ్ రేస్ చేద్దామని ప్రేమ, ధీరజ్ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు.
ఆ తర్వాత నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. చాలా థాంక్స్ నువ్వు ధీరజ్ ని సేవ్ చేసావని నర్మదని సాగర్ పొగుడుతాడు. తరువాయి భాగంలో ధీరజ్ ప్రొద్దున నిద్ర లేవకపోయేసరికి ప్రేమ వచ్చి వాటర్ కొట్టి నిద్ర లేపుతుంది. ఇద్దరు కలిసి మార్నింగ్ వాకింగ్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.