English | Telugu
రష్మీ ప్రేమను మొదటిసారి రిజెక్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా ?
Updated : Feb 2, 2025
యాంకర్ గా రష్మీ వద్దు ఇక చాలు అంటూ కొంతమంది ఆమె ప్లేస్ లో రావడానికి తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ రష్మీకి పోటీ ఇవ్వడానికి ఆర్జే కాజల్, నేహా చౌదరి, మృదుల వంటి వాళ్లంతా కూడా వచ్చారు. అలాగే కన్నడ పాప యాంకర్ సౌమ్య కూడా పోటీకి వచ్చింది. ఐతే ఆది మాత్రం రష్మీకి సపోర్ట్ చేసాడు. కానీ నాటీ నరేష్ సపోర్ట్ చేయలేదు. పైపెచ్చు ఒకప్పుడు రష్మీ లవ్ చేసిన నరేష్ ఇప్పుడు ఆ రష్మీనే వద్దు అంటూ రిజెక్ట్ చేసాడు. అంతే కాదు ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆదిని కూడా తిట్టేసాడు.
"పోరా పిల్లనాయాలా కొత్తవాళ్లను రానివ్వరా..రష్మిని నాలుగేళ్ల నుంచి చూస్తున్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్త యాంకర్స్ ని రానివ్వరు..రష్మీ నాకు పడదు..కొత్తవాళ్లను కూడా పడనివ్వరా... రష్మీ చూపించింది ప్రేమా కాదు ఏమీ కాదు" అనేసరికి రష్మీ ఫీలైపోయింది. "ఇప్పుడు భాదపడుతున్నావా రష్మీ..ఎప్పుడూ నువ్వు నన్ను రిజెక్ట్ చేసేదానివి..ఇప్పుడు ఫస్ట్ టైం నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా.." అన్నాడు ఇక భాస్కర్ వచ్చి "రష్మీ బాగుంటుంది..బిర్యానీలా ఉంటుంది..అలా అని రోజూ బిర్యానీ తింటే మోషన్స్ అవుతాయి..ఏదైనా రష్మీ నేను నీకు 1116 లు పింఛన్ ఇప్పిస్తా" అంటూ రష్మీ పరువు తీసేసాడు. ఇక అందరూ సౌమ్య మీద పడ్డారు. ఆమె మీద సెటైర్స్ వేశారు. సౌమ్య ఇచ్చిన డైలాగ్ కి ఇంకో మూడేసి చెప్తుంది. నువ్వు ఒక్కటి కూడా సరిగా చెప్పలేవు అని అందరూ రష్మీ పాపం ఏడిపించేసారు.