English | Telugu

ఎన్టీఆర్ లా ఇప్పుడు ఎవరూ లేరు...ఆ ఛానెల్ వాళ్ళు కనిపిస్తే కొట్టేవాడిని!


ఆలీతో సరదాగా షోలో ఈ వారం హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. శివాజీని ఎన్నో ప్రశ్నలు వేశారు ఆలీ. "నిన్నెవరూ గుర్తు పట్టకూడదు అని గడ్డాలు, మీసాలు తీసేసి తిరిగావ్.. ఏమయ్యింది అసలు" అని ఆలీ అడిగేసరికి " అదేం లేదన్నా అసలు. నేను చాలా మూవీస్ లో యాక్ట్ చేసేటప్పుడు తీసేస్తాను. ఐతే అప్పట్లో ఒక టీవీ ఛానల్ ఇష్యూ అయ్యింది. అప్పుడు నా మీద కేసు పెట్టారు. అది కోర్ట్ వరకు వెళ్ళింది. కోర్ట్ లో కూడా నాకే ఫేవర్ గా తీర్పు వచ్చింది. ఈలోపే అత్యుత్సాహంతో పోలీసులు నా మీద ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఓపెన్ చేశారు. అప్పటి హైకోర్టు జడ్జ్ శ్రీదేవి అసలీదేం కేసు అని గట్టిగా తిట్టి ఎల్ఓసిని తీయించేశారు.

మా అబ్బాయికి అమెరికాలో సీట్ వచ్చింది. నేను అమెరికా వెళ్తున్నా.. అప్పుడు నా పేరు రాగానే ఫ్లాగ్ రావడంతో కస్టమ్స్ ఆఫీసర్ పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి రాగానే టీవీ చానెల్స్ ని అలెర్ట్ చేస్తారు. వాళ్ళు వెంటనే "దుబాయ్ లో వేషం మార్చి దొరికిపోయిన శివాజీ" అని న్యూస్ వేసేసారు. నిజంగా ఆ టైములో నాకు వాళ్ళు కనిపిస్తే గనక కొట్టేవాడిని. కానీ ఇప్పుడు ఆవేశం చల్లారిపోయింది కాబట్టి ఏమీ అనలేను. ప్రజల్లో మార్పు రానంత వరకు ఎవరమూ ఏమీ చెయ్యలేము.. ఐతే అప్పట్లో...పాలిటిక్స్ గురించి మాట్లాడేసరికి ఇంకా నేను మూవీస్ చెయ్యను అని ఇండస్ట్రీ నెమ్మదిగా నన్ను సైడ్ చేసేసింది. నేనెప్పుడూ ప్రజల తరపునే మాట్లాడతాను. ఈరోజున రాజకీయం అంటే ఒక బిజినెస్.. ఒక రాజకీయ పార్టీలో చేరి నువ్వు ఎంపీ అవ్వాలనుకుంటే నీ దగ్గర నుంచి 150 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ పార్టీ. అదే ఎంఎల్ఏ ఐతే మినిమం 50 కోట్లన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ లా ఇప్పుడు ఎవరూ లేరు. ఆయన చాలా క్లారిటీగా పాలిటిక్స్ ని నడిపారు. కానీ ఈరోజు మనలాంటి వాళ్లకు మాత్రం ఉన్నది మొత్తం ఊడిపోయి తిరిగి లాక్కోలేక చేతగాని వాళ్ళలా మిగులుతాం." అని చెప్పాడు శివాజీ.