English | Telugu
'నాకు జబర్దస్త్ వల్ల పేరు రాలేదు'.. చంటి కామెంట్స్ వైరల్!
Updated : Aug 23, 2022
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. బిగ్ స్క్రీన్ మీద చేసినా రానంత పేరు జబర్దస్త్ స్టేజి వల్ల సాధ్యమయ్యింది. ఐతే దాన్ని కొంతమంది ఒప్పుకోకపోతుండటం గమనార్హం. ఈ జబర్దస్త్ గురించి ఎన్నో రూమర్స్ బయటికి వచ్చాయి. ఇటీవల చలాకి చంటి ఈ షో గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ షో నుంచి కూడా చాలామంది వెళ్లిపోయారు. అనసూయ కూడా అక్కడ వినిపించే బాడీ షేమింగ్ కామెంట్లు, వెకిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేక బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా చంటి తనకున్న పేరు అనేది జబర్దస్త్ వల్ల రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘జబర్దస్త్’ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు రావని, సినిమాల విషయంలో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు ఎప్పుడూ మోసపోతూ ఉంటారని, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఉన్నట్టుగాసెట్స్‌పైకి వెళ్ళాక ఉండదని అంటుంటారు నిజమేనా?’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు చలాకీ చంటి జవాబిచ్చాడు. ముందుగా,“నాకు ‘జబర్దస్త్’ వల్ల పేరు రాలేదు. నేను సినిమాలు చేసి జబర్దస్త్ కి వచ్చాను. కాబట్టి నాకు సినిమాల గురించి బాగా తెలుసు. అందుకే పెద్దగా మోసపోలేదు. బహుశా మిగతా వాళ్ళకి అది తెలియదు కాబట్టి మోసపోయి ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.
"జబర్దస్త్ కి వెళ్ళకముందే 20 సినిమాలు చేశాను. ఆ తర్వాతేజబర్దస్త్‌కు వెళ్ళాను. స్కిట్ వేరు, సినిమా వేరు. ఆ తేడా నాకు బాగా తెలుసు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చంటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.