English | Telugu
దెయ్యానికి కూడా లైన్ వేయాలనిపించింది నిన్ను చూశాక!
Updated : Oct 25, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఆది ఒక్కొక్కరి గురించి చెప్తూ వాసంతి దగ్గరకు వచ్చాడు. "ఆడవాళ్ళకు ఏ రహస్యం కూడా చెప్పకూడదు.. అలా చెప్తే అందరికీ చెప్పేసి సీక్రెట్‌గా ఉంచు" అని వాళ్లకు చెప్తారు. "ఒక పక్కన మెరీనాతో మంచం మీద గుసగుసలాడుతూనే మరో పక్క జైలులో వేసిన అర్జున్ తో ఇనుప చువ్వల మధ్య నుంచి గుసగుసలాడింది. అప్పుడు నిజంగా 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనాలపించింది" అన్నాడు.
"దెయ్యం గెటప్ వేసినప్పుడు అందంలో కేర్ తీసుకుంది ఈ అమ్మాయి ఒక్కటే ఈ హౌస్ లో.. అంటే దెయ్యానికి కూడా లైన్ వేయొచ్చు అనిపించింది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఆధార్ కార్డులో నీట్ గా మేకప్ వేసుకుని అందంగా కనిపించేది నువ్వేనేమో. మొదట్లో గేమ్ సరిగా ఆడలేదు కానీ తర్వాత మెరుగు పరుచుకుని మంచి గేమ్ ఆడుతూ వచ్చావ్" అంటూ ఆమెను పొగిడేశాడు.
ఇక రాజ్ గురించి చెప్తూ "ఈ హౌస్ లో ఒక పాట పాడాడు. ఇక అప్పటి నుంచి ఎవరూ సరిగా నిద్రపోవడమే లేదు. 'వస పత్ర సాయికి వరహాల లాలి' అనే పాట పాడాడు. ఆ పాట రాసింది ఎవరా అని గూగుల్ చేస్తుంటే ఏమీ చూపించట్లేదు. అప్పుడు తెలిసింది 'వటపత్ర సాయికి' అనే పాట గురించి అంత తప్పుగా పాడాడు" అంటూ కౌంటర్ వేశాడు.
కీర్తి గురించి చెప్తూ.. "నువ్వూ, మరీనా ఇద్దరూ తెలుగు మాట్లాడుకుంటూ ఒకరికొకరు కరెక్ట్ చేసుకుంటారు చూశారా.. ఆ సీన్ చూసినప్పుడు నిజంగా చాలా బాగుంటుంది. తెలుగు తెలియని ఇద్దరు కూర్చుని తెలుగు కరెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే ఫన్ మాకు బాగా నవ్వు తెప్పిస్తుంది. నువ్వు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా" అన్నాడు ఆది.