English | Telugu

గజని మొహమ్మద్‌లా దండయాత్ర చేస్తూనే ఉంటుంది!

బిగ్ బాస్ హౌస్ లో దివాళి సెలెబ్రేషన్స్ లో భాగంగా హైపర్ ఆది ఎపిసోడ్ మస్త్ హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు. హౌస్ లో అందరి గురించి చెప్పాడు ఆది. ఇక ఫైమా గురించి మాట్లాడుతూ " ప్రవీణ్ నిన్ను అడిగానని చెప్పమన్నాడు. నీ గురించి అనుకుంటున్నావుకదా కానీ కాదు నీకు పది వేలు ఇచ్చాడట కదా దాని గురించి గుర్తుచేయమన్నాడు" అన్నాడు దానికి హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ "ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికా" అంటూ కౌంటర్ వేశారు.

"నేను ఈ హౌస్ రావడం కోసం ఉదయం నుంచి ఏమీ తినలేదు.. ఎందుకంటే ఫైమా అందం చూస్తే కడుపు నిండిపోతుందట అని ఆ అమ్మాయే చెప్పింది అందుకే చూస్తా నా కడుపు నిండుతుందా లేదా" అంటూ పంచ్ వేసాడు ఆది. "గజని మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు ప్రతీ వారం కెప్టెన్సీ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నావ్. బయట ఆడియన్స్ నీ పట్టుదల చూసి ఏదో ఒక రోజు నువ్వు కెప్టెన్ వి అవుతావు అంటున్నారు. ఒకవేళ నువ్వు ఈ హౌస్ లో కెప్టెన్ వి కాకపోయినా బయటికి వచ్చాక మన మాటీవీ వాళ్ళు కెప్టెన్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చి మంచి స్కిట్ చేయిస్తారు. నువ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావ్, గేమ్ బాగా ఆడుతున్నావ్, నువ్ కెప్టెన్ ఐతే నాకు చూడాలని ఉంది" అంటూ ఫైమాకి విషెస్ చెప్పాడు హైపర్ ఆది.