English | Telugu

రోజా పై ఆది హాట్ కామెంట్స్....

హైపర్ ఆది ఒక చిట్ చాట్ లో రోజు గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల తర్వాత రోజా గారి మీద మీ అభిప్రాయం ఏమిటి అనేసరికి రోజా గారికి పాలిటిక్స్ ఒక వ్యక్తి అంటే ఇష్టం. తనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం అన్నారు. కానీ జబర్దస్త్ జడ్జ్ గా తనకు రోజా అంటే చాలా గౌరవం ఉందని చెప్పాడు ఆది. ఎందుకంటే తనకు కానీ తన లాంటి ఎంతో మంది కమెడియన్స్ కి పేరు వచ్చింది అంటే అది వాళ్ళ వల్లే అని చెప్పాడు ఆది. అలాగే లీడర్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని గ్యాంగ్ లీడర్ గా చిరు అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక పెళ్లి విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియాలో చాలామంది తనకు పెళ్లిళ్లు చేసేశారని చెప్పాడు.

రియల్ లైఫ్ పెళ్లి ఎప్పుడు అంటే దానికి చాల టైం ఉందన్నాడు. పెళ్లి అయ్యింది అనే దానికన్నా పెళ్లి ఎప్పుడు అనేదే బాగుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు. ఐతే దర్శి నుంచి ఎంఎల్ఏగా పోటీ చేస్తారు అని అన్నారు కానీ అది ఎందుకు జరగలేదు అని అడిగేసరికి..ఇదంతా సోషల్ మీడియాలో తన మీద అభిమానం వల్ల చేసిందే కానీ అలాంటిది ఏమీ లేదన్నాడు. అలాగే వ్యూయర్ షిప్ కోసం థంబ్ నెయిల్స్ చేశారు తప్పా ఈ పోటీలు ఏమీ లేవు..కేవలం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసినట్లు చెప్పాడు ఆది.