English | Telugu

లైఫ్‌లో శ్రీ‌ముఖి చేసిన పెద్ద తప్పు ఇదే!

బుల్లితెరపై రాములమ్మగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి.. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త మారిపోయింది. గతంలో వరుస టీవీ షోలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు షోలలో గెస్ట్ గా కనిపిస్తోందే తప్ప హోస్ట్‌గా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన హాట్ హాట్ ఫోటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఇక శ్రీముఖి ప్రేమ సంగతుల గురించి తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో ఒక‌ప్పుడు రిలేషన్ లో ఉన్నట్లు.. కానీ తరువాత బ్రేకప్ అయిందని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు చెప్పుకొచ్చింది.

తాజాగా ఈ బ్యూటీ తన ఫాలోవర్లతో ముచ్చటించింది. ఇందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ముందుగా ఓ నెటిజన్.. ''జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటి..?'' అని అడిగాడు. దానికి ఆమె.. ''జనాలను త్వరగా నమ్మడం, ప్రేమించడం'' అంటూ చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ 'మీ జీవితంలో ప్రేమ కథలు ఉన్నాయా..?' అని అడగ్గా.. అమేజింగ్ స్టోరీస్ ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.