English | Telugu
ఎందుకు నవ్వుతానో, ఎందుకు ఏడుస్తానో తెలియదు.. నేను కొంచెం తేడా!
Updated : Aug 25, 2023
హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే హరితేజ గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.
సీరియల్స్ తో మొదలైన తన కెరీర్.. టీవీ షోస్, యాంకరింగ్ అంటూ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందరి మెప్పు పొందింది. వీటితో పాటుగా డాన్స్ షోలలో సైతం తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది హరితేజ. నితిన్, సమంత నటించిన 'అఆ' మూవీ లో హరితేజ చేసిన కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో పలువురి ప్రశంసలు అందుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి కాంప్లిమెంట్ తీసుకుంది.
ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అవుటింగ్ కి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్ ఫోటోలని వీడియోలని షేర్ చేస్తుంది హరితేజ. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి పాటలు పాడుతూ కనిపించింది. అయితే ఒక పాట పాడటానికి ఎంత సాధన చేయాలో, ఎన్ని టేక్స్ అవుతాయో చెప్తూ తీసిన ఓ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఒక వీడియోకి .. " నేను ఎందుకు నవ్వుతానో తెలియదు, ఎందుకు ఏడుస్తానో తెలియదు.. నేను కొంచెం తేడా" అని క్యాప్షన్ రాసింది హరితేజ. అయితే ఇది ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతోంది. తనేం చేసిన వెరైటీగానే చేస్తానంటూ భిన్నమైన పోజ్ లతో ఫోటోలకి ఫోజులిచ్చే హరితేజ.. ఇలా తనని తాను ఎందుకు అందోనని నెటిజన్లు స్పందిస్తున్నారు.