English | Telugu

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో శివాజీ!

హీరో శివాజీ.. ఈ పేరు అందరికి సుపరిచితమే. కొన్ని సినిమాలలో హీరోగా మారి కొన్ని సినిమాలలో సెకండ్ హీరో గా తన నటనతో అందరిని మెప్పించాడు శివాజీ. పాత్ర చిన్నదైన పెద్దదైన శివాజి తన పాత్రకి న్యాయం చేసి ప్రశంసలు పొందిన హీరో. శివాజీ గత కొంతకాలంగా తెర మీద కన్పించడం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శివాజి తన కెరీర్ నీ మొదటగా ప్రముఖ టీవీ ఛానల్ లో ఎడిటర్ గా మొదలుపెట్టి.. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి తో చాలా సినిమాల్లో నటించాడు. శివాజీకి నటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం 'మిస్సమ్మ' అని చెప్పొచ్చు. లయ, భూమిక ఇద్దరు హీరోయిన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఆప్పట్లో హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రియమైన నీకు, ఒట్టేసి చెప్తున్న, యువరాజ్, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియనేస్తం, ప్రేమంటే ఇదేరా, అమ్మాయి బాగుంది, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, అదిరింది అయ్యా చంద్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజి నటించిన చిత్రాల జాబిత ఎక్కువే ఉంది. అయితే గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటు వస్తున్నాడు శివాజీ.

అమాయాక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా 'జల్సా' సినిమాలో శివాజీ నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సారి ఎంట్రీతో మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే శివాజీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.