English | Telugu

వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఏంజిల్  తెలుసుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -851 లో.. రిషి కాలేజీ రాగానే పాండియన్, అతని స్నేహితులు సపోర్ట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతారు. క్లాస్ కి టైం అయింది తర్వాత మాట్లాడుతానని రిషి అంటాడు. అప్పుడే వసుధార వచ్చి గుడ్ మార్నింగ్ అని రిషిని పలకరిస్తుంది. ఏంటి సర్ ఎందుకు డల్ గా ఉన్నారని వసుధార అంటుంది. అదేం లేదు నాకు తలనొప్పి గా ఉందని రిషి అంటాడు..

ఆ తర్వాత రిషి కావాలనే వసుధార ఇచ్చిన బ్రేస్ లైట్ ని సరిచేస్తూ ఉంటాడు. అది చూసిన వసు మురిసిపోతుంది. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ కి వెళ్లి వర్క్ చేసుకుంటుండగా.. పాండియన్ కాఫీ, ఒక టాబ్లెట్ తీసుకొని వస్తాడు. అది చూసిన రిషి‌‌.. ఈ కాఫీ ఎవరు పంపించారని అడుగుతాడు. వసుధార పంపిస్తుంది కానీ నేనే తీసుకొచ్చానని పాండియన్ చెప్తాడు. ఎవరు పంపించారో నాకు తెలుసు కానీ ఆ టాబ్లెట్ తీసుకొని వెళ్ళమని ఒక కాఫీ తాగుతాడు. అదంతా వసుధార చాటు నుండి చూస్తుంది. మరొక వైపు విశ్వనాథ్ కి ఏంజిల్ టాబ్లెట్ తీసుకొని వస్తుంది. రిషి ఎందుకో డల్ గా ఉన్నాడు. ఏమై ఉంటుందని ఏంజెల్ అనగానే.. నేను కూడా రిషిని గమనించాను కానీ నువ్వు పదే పదే రిషిని అడిగి ఇబ్బంది పెట్టకు తన పర్సనల్ తనది తనది, చెప్పాలనిపిస్తే చెప్తాడని విశ్వనాథ్ అంటాడు. నువ్వు నీ పెళ్లి గురించి నాకు చెప్తానన్నావ్ ఏమైందని వఏంజిల్ ని విశ్వనాథ్ అడుగుతాడు. చెప్తాను నాకు కొంచెం టైమ్ కావాలని ఏంజిల్ చెప్తుంది.

మరోక వైపు రిషి దగ్గరికి వసుధార వస్తుంది. ఇద్దరు సరదాగా ఆర్గుమెంట్ చేసుకుంటూ ఉంటారు. థాంక్స్ కాఫీ పంపినందుకని రిషి అంటాడు. మీ క్కూడా థాంక్స్ కాఫీ తాగినందుకని వసుధార అంటుంది. మరొక వైపు ఏంజిల్ కాలేజీకి వస్తుంది వసుధార దగ్గరికి వెళ్లి.. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకని అడుగుతుంది. ఆ తర్వాత వసుధారని ఏంజెల్ బయటకు తీసుకొని వెళ్తుంది. అది రిషి చూస్తాడు. వసుధారని ఎలాగైనా ఏంజిల్ తో వెళ్ళనివ్వకుండా ఆపాలని వసుధారకి రిషి ఫోన్ చేస్తాడు. రిషి ఫోన్ వసుధార కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.