English | Telugu
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమని రేవతి చెప్పగలదా.. ముకుంద ఏం చేయనుంది!
Updated : Aug 26, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -245 లో.. మురారిని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటుంది కృష్ణ. అయిన మురారి కళ్ళు తెరిచి చూడకపోయేసరికి.. కృష్ణ ఏడుస్తూ కళ్ళు తెరవండి ఏసీపీ సర్ అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత కృష్ణ ట్రీట్మెంట్ చెయ్యడం వళ్ళ మురారి స్పృహలోకి వస్తాడు.
మరొక వైపు ముకుంద గదిలోకి భవాని వస్తుంది. గది ఎంత బాగా ఉంచుకుంది. మనసు కూడా అలాగే అదుపులో ఉంచుకుంటే బాగుండేదని భవాని అనుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. ఏంటి అత్తయ్య ఇలా వచ్చారని అడుగుతుంది. నువ్వు ఇంకా నీ ప్రేమలోనే ఉన్నావని అనిపిస్తుంది. నువ్వు నాతో అబద్ధం చెప్పావని భవాని అనగానే.. నా మీద నమ్మకం లేదా అని ముకుంద అంటుంది. లేదు.. నా దగ్గర నిజం దాచి తప్పు చేసావని భవాని అంటుంది. నాకు అర్థం అయింది మీరు నన్ను ఇంక ఎప్పుడు నమ్మరని ఈ గది అంతా చెక్ చేసుకొని చూడండి. నేను డిస్టబ్ చెయ్యను అని ముకుంద వెళ్తుంటే.. భవాని ఆపి నేనే వెళ్లిపోతున్నా అంటూ తన గదిలో నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు మురారికి కృష్ణ ట్రీట్ మెంట్ చేస్తుంటుంది. తగిలిన గాయాలకి కట్లు కడుతుంటుంది కృష్ణ. మరొక వైపు రేవతి ఎలాగైనా కృష్ణ, మురారి ఇద్దరు ఉన్నా క్యాంపు దగ్గరికి వెళ్లి వాళ్లకి అగ్రిమెంట్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాలనుకుంటుంది రేవతి.
మరొకవైపు మురారితో కృష్ణ మాట్లాడుతుంది. కృష్ణ పక్కకి వెళ్లగానే.. ఇద్దరు కానిస్టేబుల్స్ మురారి దగ్గరికి వచ్చి.. మేడమ్ మీ కోసం చాలా కష్టపడ్డారు సర్. మీ కోసం డాక్టర్ నే గల్లా పట్టి అడిగారని కానిస్టేబుల్ చెప్పగానే కృష్ణకి నేను అంటే ఇష్టం అన్నట్లు చూస్తాడు. మురారి కృష్ణ సపోర్ట్ తో నడుస్తాడు. మరొక వైపు రేవతి అత్తయ్య కన్పించడం లేదు ఎక్కడికి వెళ్ళిందని అలేఖ్యని ముకుంద అడుగుతుంది. కృష్ణ దగ్గరికి వెళ్లి ఉండవచ్చని అలేఖ్య అనగానే.. మళ్ళీ కృష్ణ ఇంటికి రాకూడదని ముకుంద అంటుంది. త్వరలోనే నిన్ను మురారిని పెళ్లి పీటలపై చూడాలని అలేఖ్య అనగానే.. థాంక్స్ అంటూ ముకుంద చెప్తుంది. మరొకవైపు మురారికి కృష్ణ దగ్గర ఉండి భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.