English | Telugu

Guppedantha Manasu : శైలేంద్ర పాపాల చిట్టా బయటపెట్టిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1167 లో.. శైలేంద్రని చంపడానికి మహేంద్ర కోపంగా వస్తుంటే.. శైలేంద్ర ఎదరుపడుతాడు. కోపంగా ఎక్కడికో వెళ్తున్నారని శైలేంద్ర అడుగుతాడు. నీకోసమే వస్తున్నానురా అంటూ తన కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. ముందు నిన్ను ఫినిష్ చేసి తర్వాత వాళ్ళ పని చూస్తానని శైలేంద్ర అనగానే.. మహేంద్ర తన చెంప చెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత కొందరు రౌడీలు మహేంద్రని పట్టుకుంటారు. కర్రతో శైలేంద్ర మహేంద్ర తలపైన కొడుతాడు. బాబాయ్ నీ గురించి తెలిసే నా ప్లాన్ లో నేనున్నానని శైలేంద్ర రౌడీలకి చెప్పి.. మహేంద్రని కిడ్నాప్ చేయిస్తాడు.

ఆ తర్వాత మహేంద్రని ఒక దగ్గరికి తీసుకొని వెళ్లి తాళ్లతో కట్టేస్తాడు. ఇక తను చేసిన దుర్మార్గుల గురించి శైలేంద్ర చెప్తుంటాడు. నా గురించి నీకు ఎలా తెలిసిందని శైలేంద్ర అడుగుతాడు. జగతి నీ పాపాల చిట్టా మొత్తం ఒక లెటర్ లో రాసిందని మహేంద్ర చెప్తాడు. ఆ లెటర్ లో పిన్ని రాయని విషయాలు చాలా ఉన్నాయ్.. నీకు ఒక్కొకటి చెప్తా విను అని శైలేంద్ర అంటాడు. మా అమ్మ పిన్నిని ఇంట్లో నుండి పంపించేసింది. రిషి పై ఎటక్ చేసింది నేనే అని శైలేంద్ర అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. మొన్న నీ మీద ఎటాక్ చేసింది కూడా నేనే అనగానే.. తెలుసని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా అని మను తండ్రి ఎవరో తెలుసా అని శైలేంద్ర అనగానే.. తెలుసు నేనే మను తండ్రి అని మహేంద్ర అంటాడు. నీకు తెలియని విషయం చెప్పనా మను తల్లి అనుపమ కాదు జగతి. రిషి, మను కవల పిల్లలని మహేంద్ర అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. నీకు తెలియని విషయం ఏంటంటే జగతి పిన్ని హాస్పిటల్ నుండి వచ్చాక.. మేమే జ్యూస్ లో విషం కలిపామని శైలేంద్ర చెప్పగానే మహేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత రౌడీలతో మహేంద్రని చంపమని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు.

మరొకవైపు వసుధార ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి.. మావయ్య కన్పించడం లేదు.. ఈ శైలేంద్ర ఏదో చేసాడని అంటుంది. ఆ తర్వాత జగతి రాసిన లెటర్ ఫణీంద్రకి ఇస్తుంది. అది చదివి. ఫణీంద్ర తట్టుకోలేక గుండె పట్టుకుంటాడు. అంతలా ఏముందని దేవయాని అనగానే.. మీ పాపాల చిట్టా అని వసుధార అంటుంది. మేం ఏ తప్పు చెయ్యలేదు.. వాళ్లే కావాలని చేస్తున్నారని శైలేంద్ర అంటుంటే.. లేదు మావయ్య.. అంత వీళ్ళే చేశారు.. ఇన్ని రోజులు మీ గురించి అలోచించి ఏం చెప్పలేదని ధరణి అంటుంది. ఆ తర్వాత రిషి, మహేంద్రలు వస్తారు. అప్పటికే నేనేం తప్పు చెయ్యలేదని శైలేంద్ర అంటుంటే.. శైలేంద్ర మాట్లాడిన మాటలన్నీ వీడియో చూపిస్తాడు మహేంద్ర. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తావా అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.