English | Telugu
Guppedantha Manasu : కూపీలాగిన శైలేంద్ర.. మహేంద్రని కాపాడిన రిషి!
Updated : Aug 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1163 లో.... ఫణీంద్ర, శైలేంద్రలు మహేంద్ర దగ్గరికి వస్తారు. ఇలా వచ్చారేంటని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషికి బయటకు రా అంటూ శైలేంద్ర సైగ చేస్తాడు. రిషి బయటకు రాగానే నువ్వు రిషివా రంగావా అని అడుగుతాడు. ఎందుకు అలా డౌట్ పడుతున్నారని రిషి అడుగగా.. నేను సరోజని కలిసాను.. నువ్వు వసుధార నీ ఇంట్లో ఉన్న విషయం ఎందుకు నాతో చెప్పలేదు.. అయినా ఒకసారి ఫోటో చూపించి అడిగితే తెలియదన్నావ్ కదా.. ఎందుకు నాతో అబద్దం చెప్పావని శైలేంద్ర అడుగుతాడు.
ఆ తర్వాత రిషి పాండు ఫోటో చూపించి.. వీడు ఆ మేడమ్ పై ఎటాక్ చేయబోతుంటే నేనే కాపాడాను.. వాళ్ళు నాపై ఎటాక్ చేస్తుంటే మేడమ్ కాపాడారు. అందుకే మేడమ్ ప్రాబ్లమ్ లో ఉందనుకొని చెప్పలేదని రిషి చెప్తాడు. మరి ఇక్కడికి వచ్చాక కూడా చెప్పాలి కదా అని శైలేంద్ర అనగానే.. మీరు నన్ను అడగలేదని రిషి అంటాడు. అయిన ప్రతిసారీ మీరు ఎందుకు నాపై డౌట్ పడుతున్నారు.. మీపై నేనెప్పుడైన డౌట్ పడుతున్నానా.. మేడమ్ గారు మీ గురించి చాలా చెప్పారు.. రిషి వాళ్ళ అమ్మపై ఎండీ సీట్ గురించి ఎటాక్ చేయించారట.. అయిన మిమ్మల్ని మంచివారని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఇంకోసారి మీరు నాపై డౌట్ పడితే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానని శైలేంద్రతో రిషి అంటాడు. ఆ తర్వాత వసుధార పిలుస్తుంటే రిషి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే శైలేంద్ర ఫోన్ లో.. షూట్ మిస్ అవ్వద్దని అనడం రిషి వింటాడు. ఆ తర్వాత ఫణీంద్ర, శైలేంద్రలు వెళ్ళిపోదామని బయటకు వస్తారు. వాళ్లతో మహేంద్ర కూడా బయట వరకు వస్తాడు. శైలేంద్ర సైగ చెయ్యగానే రౌడీ షూట్ చేస్తాడు. వెంటనే రిషి మహేంద్రని పక్కకి లాగుతాడు. ఆ తర్వాత శైలేంద్ర డిస్సపాయింట్ అవుతాడు. ఏం తెలియనట్టు ఏమైంది బాబాయ్ అంటూ అడుగుతాడు.
ఇలా జరిగిందేంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఫణీంద్ర అనగానే.. వద్దని శైలేంద్ర అంటాడు. నేను చూసుకుంటానని రిషి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. శైలేంద్రని రిషి కోపంగా చూస్తుంటాడు. ఆ తర్వాత ఇది ఎవరు చేసారో నాకు తెలుసు అంటు వసుధార కోపంగా వెళ్తుంది. మరొకవైపు సరోజకి శైలేంద్ర ఫోన్ చేసి.. ఆ వసుధార మీ బావని నీకు దూరం చేస్తుందని, ఆ వసుధార సంగతి చెప్పు అడ్రెస్ పంపిస్తున్నానని శైలేంద్ర అనగానే.. సరేనని సరోజ అంటుంది. ఆ తర్వాత మా మావయ్య గారిపై ఎందుకు ఎటక్ చేసావని మనుని వసుధార అడుగుతుంది. నేను చెయ్యలేదు.. అయిన నేనెందుకు చేస్తానని మను అనగానే.. అతనే నీ కన్నతండ్రి అని చెప్పబోయి వసుధార ఆగిపోతుంది. ఇప్పుడు కూడా చెప్పట్లేదని మను అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.