English | Telugu
Guppedantha Manasu : తిట్టిపోసిన దేవయాని.. రిషి యాక్టింగ్ మాములుగా లేదుగా!
Updated : Aug 3, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1143 లో.... శైలేంద్ర స్పృహలోనుండి బయటకు వచ్చి రంగాతో మాట్లాడుతుంటాడు. అప్పుడే వసుధార వాళ్ళు అందరు వస్తారు. ఎందుకు అలా పడిపోయావని ఫణింద్ర అడుగుతాడు. ఎమోషన్ తట్టుకోలేక అలా పడిపోయాను.. వసుధార, రిషిలు వచ్చారు కదా అని శైలంద్ర అంటాడు. మేమ్ ఏం పడిపోలేదే అలా అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మేమ్ వెళ్ళిపోతాం అన్నయ్య అని మహేంద్ర అంటాడు. మీరు ఇక్కడే ఉండాలని ఫణీంద్ర అంటాడు. లేదు అన్నయ్య అని మహేంద్ర అనగానే.. సరే మీ ఇష్టం కానీ ఈ ఒక్క రోజు అయిన ఉండండి రిషి అని ఫణీంద్ర అనగానే రిషి సరే అంటాడు.
ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక సర్ మీరు నాతో రండి అని వసుధార అనగానే.. నేను వెళ్ళనని శైలేంద్రతో రిషి అంటాడు. వెళ్ళరా అంటూ శైలేంద్ర అనగానే రిషి వెళ్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు మహేంద్ర దగ్గరికి వెళ్తారు. నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది రిషి.. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ .. అసలేం జరిగిందని మహేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. నేను చెప్పాను కదా మావయ్య.. వాళ్ళు తప్పకుండా వస్తారని అంటుంది. ఇంతకు రిషి ఎక్కడున్నాడో ఎలా తెలిసిందని ధరణి అడుగుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి అవును ఎక్కడ కలిసావని అడుగుతాడు. కాలేజీ ప్రాబ్లమ్ లో ఉందని తెలిసి వచ్చాను.. ఇక్కడే రిషి సర్ ని చూసి ఏంట్రీ ప్లాన్ చేశానని వసుధార చెప్పగానే.. సేమ్ ఆ రంగా గాడు కూడ ఇదే చెప్పాడని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని శైలేంద్రని తిడుతుంది. ఆ రౌడీ వసుధారని చంపేశాడు అన్నావని అంటుంది. అవును వాడు నన్ను మోసం చేసాడని శైలేంద్ర అంటాడు. ఇక ఆ రంగా గాడిని తీసుకొని వచ్చి రిషిని చేసావ్.. ఇప్పుడు ఇదంతా ప్రాబ్లమ్ అవుతుందని తిడుతుంది.
ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఈ రంగా గాడు నటించమంటే జీవిస్తున్నాడని దేవయానితో శైలేంద్ర అంటాడు. చాలా రోజుల తర్వాత రంగా మన ఇంటికి వచ్చాడని శైలేంద్ర అనగానే అందరు షాక్ అవుతారు. రిషి అనబోయి రంగా అన్నానంటూ శైలేంద్ర కవర్ చేస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు సరదాగా మాట్లాడుకుంటుంటే.. మహేంద్ర వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.