English | Telugu

Krishna Mukunda Murari:కృష్ణని శోభనానికి రెడీ చేసిన ముకుంద.. తన గదిలో కూర్చొని ఏడపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -369లో.. కృష్ణ ముగ్గు వెయ్యడానికి బయటకు వెళ్తుంది. ఆల్రెడీ ముగ్గు వేసి ఉండడంతో.. ఎవరు వేశారంటు కృష్ణ లోపలికి వచ్చి అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగిన తాము వెయ్యలేదని చెప్పడంతో ఎవరు వేసి ఉంటారా అని కృష్ణ ఆలోచిస్తు ఉండగా.. అప్పుడే ముకుంద పూజ చేసి హారతి తీసుకొని వచ్చి అందరికి ఇస్తుంది. ముగ్గు నువ్వు వేసావా అని కృష్ణ అనగానే.. అవును నేనే వేసానని ముకుంద చెప్తుంది.

ఆ తర్వాత ఈ రోజు నువ్వు ఏ పని చెయ్యవద్దు అంత నేను చూసుకుంటాను. ఎందుకంటే ఈ రోజు నీకు శోభనమని ముకుంద అనగానే.. కృష్ణ సిగ్గుపడి వెళ్ళిపోతుంది. కృష్ణ నన్ను క్షమించింది తన ఋణం ఎన్ని జన్మలైన తీర్చుకోలేనని రేవతితో ముకుంద అంటుంది.. కాసేపటికి కృష్ణ అప్పుడే నిద్ర లేచిన మురారి దగ్గరికి వెళ్లి.. ఈ రోజు నేను ముగ్గు వెయ్యలేదు ముకుంద వేసిందని సిగ్గు పడుతుంది. దానికి ఎందుకు బాధపడుతున్నవ్ అని మురారి అనగానే.. నేను బాధపడడం లేదు సిగ్గు పడుతున్నానని కృష్ణ అనగానే అవునా అంటూ మురారి నవ్వుతు ఉంటాడు. ఈ రోజు శోభనం కదా నన్ను ఏ పని చెయ్యకని ముకుంద చెప్పిందని కృష్ణ అనగానే.. అవును ముకుంద చెప్పింది కరెక్టే కదా అని మురారి అంటాడు. కాసేపటికి నేను కృష్ణ వెళ్లి శోభనం ఏర్పాట్లకి కావలిసిన సామాను తీసుకొని వస్తామని భవానీతో ముకుంద అనగానే.. అవసరం లేదు నందు, గౌతమ్ ఇద్దరు తీసుకొని వస్తారని భవాని అంటుంది. దాంతో ముకుంద బాధపడుతుంది. ఆ తర్వాత పంతులు గారు వచ్చి శోభనానికి ముహూర్తం పెడతాడు. మరొకవైపు కృష్ణని అందంగా రెడీ చేసి తీసుకొని వస్తానని కృష్ణని తీసుకొని ముకుంద బయటకు వెళ్తుంది.

ఆ తర్వాత భవాని దగ్గరికి రేవతి వచ్చి.. మురారీని మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేయించండని చెప్తుంది. సరే అని భవాని అంటుంది. దంతో పాటు కృష్ణకి హాస్పిటల్ కట్టిస్తున్నాను దానికి సంబంధించిన కాంట్రాక్టు పెద్దపల్లి ప్రభాకర్ కి ఇస్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణని తీసుకొని ముకుంద రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళి.. ఇన్ని రోజులు తను చేసిన తప్పులకి సారి చెప్తుంది. ఇక ఇంట్లో ఉన్న మురారి.. కృష్ణ ఎక్కడ అంటూ మధుని అడుగుతాడు. అప్పుడే కృష్ణని అందంగా రెడీ చేసి ముకుంద తీసుకొని వస్తుంది. కృష్ణని అందరు చూసి బాగున్నావని అంటారు. కాసేపటికి కృష్ణని శోభనానికి రెడీ చేస్తారు. తరువాయి భాగంలో కృష్ణ శోభనానికి రెడీ అయి ముకుంద ఎక్కడ అని అడుగుతుంది. ముకుంద తన గదిలో ఏడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.